MAN KILLS HIS FRIEND AFTER SUSPECTED ILLEGAL AFFAIR WITH HIS WIFE IN ANDHRA PRADESH SU
భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానం.. స్నేహితుడిని కడతేర్చిన లారీ డ్రైవర్
ప్రతీకాత్మక చిత్రం
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో సెప్టెంబర్ 6న లభ్యమైన గుర్తు తెలియని మృతదేహాం మిస్టరీని పోలీసులు చేధించారు. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ లారీ డ్రైవర్ బాధితుడిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో సెప్టెంబర్ 6న లభ్యమైన గుర్తు తెలియని మృతదేహాం మిస్టరీని పోలీసులు చేధించారు. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ లారీ డ్రైవర్ బాధితుడిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు.. కృష్ణా జిల్లా కంచికర్లకుచెందిన రాంగోపాల్, అదే గ్రామానికి చెందిన తోట నాగేంద్రబాబు స్నేహితులు. రాంగోపాల్ ఆస్ట్రేలియా ఎంఎస్సీ చేసి ఇండియాకు తిరిగివచ్చాడు. నాగేంద్ర లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయితే కొద్ది రోజులుగా రాంగోపాల్‌తో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని బంధువులు వ్యాఖ్యానించడం నాగేంద్ర విన్నాడు. దీంతో రాంగోపాల్ ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 28నరాంగోపాల్ హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. అదే రోజు సాయంత్రం స్నేహితుడు నాగేంద్రతో కలిసి మార్బుల్ తీసుకురావడానికి లారీలో గుజరాత్‌కు వెళ్లాడు. సెప్టెంబర్ 5న మార్బుల్ లోడ్‌తో బొబ్బిలికి చేరకున్నారు.
లారీలోని లోడ్ దించాక తిరిగి ఇంటికి వస్తుండగా..పారిశ్రామికవాడ వద్ద నాగేంద్ర లారీని ఆపారు. అక్కడ రాంగోపాల్‌తో మద్యం తాగించాడు. తనకు మద్యం అలవాటు ఉన్నప్పటికీ నాగేంద్ర మద్యం ముట్టుకోలేదు. తమతో పాటు ఉన్న క్లీనర్ శివను క్యాబిన్లో పడుకోవడంతో.. నాగేంద్ర తన పథకాన్ని అమలు చేశాడు. మద్యం తాగి స్పృహ కోల్పోయిన రాంగోపాల్‌ను రోడ్డుపై పడేసి లారీతో తొక్కించి హత్య చేశాడు. క్లీనర్ శివ నిద్రలేచి.. రాంగోపాల్ ఎక్కడని ప్రశ్నించగా.. విశాఖలోని సోదరుడి ఇంటికి వెళ్లాడని నమ్మించాడు.
ఇక, సెప్టెంబర్ 5 నుంచి రాంగోపాల్ ఫోన్ పనిచేయకపోవడంతో ఆయన తల్లిదండ్రులు పోలీసులు ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన కృష్ణా జిల్లా పోలీసులు.. ఫోన్ ట్రాక్ చేయగా బొబ్బిలి ఉన్నట్టు సమాచారం రావడంతో అక్కడి పోలీసులకు సమాచారం చేరవేశారు. మరోవైపు నాగేంద్రతో తమ కుమారుడు సన్నిహితంగా ఉంటాడని రాంగోపాల్ తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.
సెప్టెంబర్ 6న లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం రాంగోపాల్దేనని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడు నాగేంద్రపై పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉందని పోలీసులు తెలిపారు. క్లీనర్లను కూడా విచారించాల్సి ఉందన్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.