Home /News /crime /

MAN KILLS HIS BROTHER FOR MISBEHAVING WITH HIS WIFE IN NIZAMABAD DISTRICT SSR

Nizamabad: పెళ్లి కోసం మరిది తహతహ.. ఫుల్ మూడ్‌లో వదినతో అలా మాట్లాడాడు.. ఆమె ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాజు బుద్ధి పెడతోవ పట్టింది. రాజు తన అన్న భార్య సుశీలపై కన్నేశాడు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆమెతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ.. వెకిలి వేషాలు వేసేవాడు. వదినతో తప్పుగా ప్రవర్తించకూడదన్న స్పృహ కూడా లేకుండా రాజు అదే పనిగా ఆమెను ఇబ్బందిపెట్టసాగాడు. ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ.. వేధించసాగాడు.

ఇంకా చదవండి ...

    ఆర్మూర్: ఆ యువకుడికి పెళ్లి కాలేదు. తనకు పెళ్లి అయ్యేలా లేదని స్నేహితులతో చెప్పుకుని చింతించేవాడు. అన్న భార్యతో వెకిలి చేష్టలు, అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం ఆమె తన భర్తతో చెప్పడంతో ఆ యువకుడిని సొంత అన్నే హతమార్చాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కమలానెహ్రు కాలనీలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలానెహ్రు కాలనీకి చెందిన మక్కల శీను, మక్కల రాజు(30) అన్నదమ్ములు. మక్కల శీనుకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. రాజు ఊళ్లో కూలి పని చేసుకుంటూ జీవించేవాడు. తనకు పెళ్లి కావడం లేదని రాజు కొంత కాలంగా బాధపడుతున్నాడు. ఇక తనకు ఎవరూ పిల్లనిచ్చి పెళ్లి చేయరని స్నేహితుల దగ్గర చెప్పుకుని చింతించేవాడు. ఈ క్రమంలోనే.. రాజు బుద్ధి పెడతోవ పట్టింది. రాజు తన అన్న భార్య సుశీలపై కన్నేశాడు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆమెతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ.. వెకిలి వేషాలు వేసేవాడు. వదినతో తప్పుగా ప్రవర్తించకూడదన్న స్పృహ కూడా లేకుండా రాజు అదే పనిగా ఆమెను ఇబ్బందిపెట్టసాగాడు. ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ.. వేధించసాగాడు. ఈ వేధింపులు తాళలేని సుశీల మరిది ప్రవర్తన గురించి తన భర్త శీనుతో బుధవారం చెప్పింది. ఆ సమయంలో రాజు ఇంట్లో లేడు. రాత్రి 12 గంటల సమయంలో తాగిన మత్తులో తూలుతూ రాజు ఇంటికొచ్చాడు. అన్నావదినలతో గొడవ పెట్టుకున్నాడు. తనకు పెళ్లి చేయాలని పెద్దపెద్దగా కేకలేశాడు. ఆ సమయంలో కూడా అన్న ముందే వదినతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ పరిణామంతో కోపంతో ఊగిపోయిన శీను తమ్ముడితో ఘర్షణకు దిగాడు.


    రాజును వదినతో అలా ప్రవర్తించవద్దని శీను మందలించాడు. అయినా రాజు వినకపోవడంతో శీను, అతని భార్య సుశీల కలిసి తాగిన మైకంలో ఉన్న రాజుపై కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత బండరాయి తీసుకుని తలపై వేయడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు మృతదేహాన్ని ఇంటి నుంచి కొద్ది దూరం ఈడ్చుకెళ్లిన శీను అక్కడే వదిలేశాడు. ఉదయం రాజు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.


    ఇది కూడా చదవండి: Warangal: లవ్ మ్యారేజ్.. దారి తప్పిన భర్త.. భార్య దగ్గర బంధువైన మహిళతో అఫైర్.. చివరికి..

    రాజు అన్నయ్య శీనును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తన తమ్ముడిని తానే చంపినట్లు అంగీకరించాడు. దీంతో.. పోలీసులు శ్రీనును అరెస్ట్ చేసి అతనిపై రాజు సోదరి రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. రాజు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు కరోనా భయంతో స్థానికులెవరూ ముందుకు రాలేదు. దీంతో.. పోలీసులే అతని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Nizamabad District, Telangana crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు