తెలంగాణలో దారుణం.. అనుమానంతో తండ్రిని కొట్టి చంపిన కొడుకు..

ప్రతీకాత్మక చిత్రం

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కన్న తండ్రిని ఓ కొడుకు కర్రతో మోది చంపాడు.

  • Share this:
    నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కన్న తండ్రిని ఓ కొడుకు కర్రతో మోది చంపాడు.రుద్రూర్ మండలం అంభం గ్రామానికి చెందిన గుంజురు గంగారం(58)కు గంగాధర్ అనే కొడుకు ఉన్నాడు. గంగాధర్ భార్యతో గంగారం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ అనుమానంతోనే రాత్రి గంగారం పశువలపాకలో నిద్రిస్తుండగా కర్రతో తండ్రి తలపై గంగాధర్ కొట్టి చంపాడు. దీనితోపాటు ఆస్తి విషయంలో తరచూ తండ్రి కొడుకులకు గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: