తమ్ముడి మాజీ లవర్‌పై అన్న దారుణం.. పెళ్లిచేసుకోమంటోందని..

సునీత చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తగలబెట్టేశాడు. అనంతరం హంతకుడు అన్వర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

news18-telugu
Updated: November 5, 2019, 2:58 PM IST
తమ్ముడి మాజీ లవర్‌పై అన్న దారుణం.. పెళ్లిచేసుకోమంటోందని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెళ్లయిపోయిన తన తమ్ముడిని పదే పదే పెళ్లిచేసుకోవాలని వేధిస్తోందని ఓ మహిళను అత్యంత దారుణంగా చంపాడు అతడి అన్న. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ - చంపా జిల్లాలో సునీత కుష్వాహా (35) అనే మహిళ తల మీద రాయితో కొట్టి చంపారు. అనంతరం ఆమెను గుర్తుపట్టకుండా దహనం చేశారు.

సునీత కుష్వాహా, జమీర్ మధ్య గతంలో ప్రేమవ్యవహారం కొనసాగింది. వారిద్దరూ గతంలో బిలాస్‌పూర్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తుండగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమ వ్యవహారం నచ్చని జమీర్ కుటుంబసభ్యులు అతడికి వేరే యువతితో పెళ్లి జరిపించారు. అయితే, పెళ్లయినా సరే జమీర్‌ను సునీత వదల్లేదు. తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది.

ఈ క్రమంలో గత ఆదివారం సునీత కుష్వాహా నవ్‌గఢ్‌లోని జమీర్ ఇంటికి వెళ్లింది. అయితే, ఆ సమయంలో జమీర్ ఇంట్లోలేడు. అతడి సోదరుడు అన్వర్ ఇంట్లో ఉన్నాడు. ‘మా వాడికి పెళ్లయిపోయింది. వాడిని వదిలెయ్యి.’ అని ఆమెను హెచ్చరించాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈక్రమంలో అన్వర్ రాయి తీసుకుని సునీత తలమీద కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.

సునీత చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తగలబెట్టేశాడు. అనంతరం హంతకుడు అన్వర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.కేన్సర్ పేషెంట్ల కోసం గుండుకొట్టించుకున్న యువతి

First published: November 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>