వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మరిది.. ఆమెతో కలిసి ఉండటం కోసం ఏం చేశాడంటే..

ప్రతీకాత్మకచిత్రం

ఓ వ్యక్తి వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు దారుణానికి ఒడిగట్టాడు.

 • Share this:
  ఓ వ్యక్తి తన అన్న భార్యతో వివాహేతరం సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో కలిసి ఉండాలని భావించాడు. ఇందుకోసం మాస్టర్ స్కెచ్ వేశాడు. అయితే చివరకు పోలీసులకు అనుమానం రావడంతో అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఝాలావర్ జిల్లాలోని పన్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. పన్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్ఖండియా ప్రాంతానికి చెందిన సంజయ్ అనే వ్యక్తి తన వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో రాసలీలలు సాగించాడు. అయితే తమ బంధానికి అన్న బలరామ్ అడ్డుగా ఉన్నాడని భావించాడు. ఎలాగైనా అన్నను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ రోజు బలరామ్‌ను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు.

  అక్కడే అతడిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఇక, ఈ హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అతడిని ఎవరు హత్య చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు సంజయ్ కూడా పోలీసులతో పాటే హత్య జరిగిన చోటుకు వెళ్లాడు. అయితే ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారించారు.

  మృతుడి తమ్ముడి సంజయ్‌పై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అతడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. వివాహేతరం సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఈ హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ హత్యలో మృతుడి భార్య పాత్రపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
  Published by:Sumanth Kanukula
  First published: