ఆస్తి కోసం.... అడ్డొచ్చిన కుక్కను అంతం చేశాడు...

రమాదేవి తమ్ముడు అక్క మీద కోపం కుక్క మీద చూపాడు. కుక్క మెడ మీద కాలు వేసి తొక్కి చంపాడు.

news18-telugu
Updated: October 20, 2019, 7:58 PM IST
ఆస్తి కోసం.... అడ్డొచ్చిన కుక్కను అంతం చేశాడు...
హత్యకు గురైన కుక్క (File)
  • Share this:
ఆస్తి కోసం కొట్లాడిన ఓ వ్యక్తి, తనకు అడ్డొచ్చిన కుక్కను తొక్కి చంపాడు. హైదరాబాద్‌లో ఈ దారుణం జరిగింది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాపేటలో నిన్న రాత్రి అక్కాతమ్ముళ్ల మధ్య ఆస్తికోసం గొడవ జరిగింది. అక్కాతమ్ముళ్లు తీవ్రంగా తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. ఆ సమయంలో అక్క రమాదేవికి చెందిన కుక్క అడ్డు వచ్చింది. దీంతో రమాదేవి తమ్ముడు అక్క మీద కోపం కుక్క మీద చూపాడు. కుక్క మెడ మీద కాలు వేసి తొక్కి చంపాడు. దీంతో రమాదేవి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. కుక్క కళేబరానికి స్థానికంగా ఓ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కుక్కను చంపిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

జగన్‌ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకంFirst published: October 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు