MAN KILLED WOMAN FOR REJECTING EXTRAMARITAL AFFAIR IN KURNOOL DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Andhra Pradesh: భర్త చనిపోవడంతో ఒంటరైన మహిళ... మరో వ్యక్తితో రిలేషన్.. అంతలోనే దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
Extra Marital Affair: భర్త చనిపోవడంతో ఆమె ఒంటరైంది. పిల్లల్ని తీసుకొని పుట్టింటికి చేరింది. ఎవరి మీదా ఆధారపడి బ్రతకకుండా సొంతగా వ్యాపారం చేస్తోంది. ఇంతలో ఆమె జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడు.
భర్త చనిపోవడంతో ఆమె ఒంటరైంది. పిల్లల్ని తీసుకొని పుట్టింటికి చేరింది. ఎవరి మీదా ఆధారపడి బ్రతకకుండా సొంతగా వ్యాపారం చేస్తోంది. ఇంతలో ఆమె జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఇద్దరు పిల్లలు ఉండగా ఇలాంటి పనులు సరికావని భావించిందో ఏమో.. అతడ్ని దూరం పెట్టింది. దీంతో కక్ష పెట్టుకున్న ఆతడు మృగాడిలా మారాడు. దారుణంగా కొట్టి చంపి మృతదేహాన్ని దహనం చేశాడు. చివరకి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామానికి చెందిన రాధమ్మకు 15 ఏళ్ల క్రితం బోయవాండ్లపల్లెకు చెందిన రామ్మోహన్ తో పెళ్లైంది. కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో పోతుదొడ్డిలోని తన పుట్టింటికి వచ్చింది. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
బ్రతుకుదెరువు కోసం స్వగ్రామంలోనే ఓ చిన్న బడ్డీకొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్న రాధమ్మకు అదే గ్రామానికి చెందిన ధనుంజయులు అలియాస్ అంజితో పరియచమైంది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన ఆమె పుట్టింటివారు మందలించడంతో చిన్నచిన్న గొడవలు అయ్యాయి. దీంతో రాధమ్మ.. ధనుంజయులను దూరం పెట్టింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈనెల 3న ఆమె బడ్డీ కొట్టుకోసి సరుకులు కొనేందుకు ప్యామిలి వెళ్లింది. ఆమె ఎంతకి తిరిగిరాకపోవడంతో ఆమె అన్న సుంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఈక్రమంలో నల్లబల్లి గ్రామ పరిధిలోని ఊరుచివర ఉన్న యాటగాని గుట్ట సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించగా ఆ మృతదేహం రాధమ్మదిగా తేల్చారు. రాధమ్మతో వివాహేతర సంబంధం ఉన్న ధనుంజయలు తనను దూరం పెట్టిందన్న కోపంతో ఆమెను హత్య చేసి మృతదేహాన్ని దహనం చేసినట్లు గుర్తించారు. అంతేకాదు శవాన్ని ఎవరూ గుర్తించకుండా కొండలోని బండరాళ్ల మధ్యలో వేసి దహనం చేశాడు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు ధనుంజయులుతో పాటు అతడి స్నేహితుడు రంగస్వామిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులిద్దరూ పరారీలోఉన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.