ప్రాణాలు తీసిన పత్తాలాట... డబ్బుల కోసం అల్లున్నే అతి కిరాతకంగా..

ప్రతీకాత్మక చిత్రం

వాళ్లిద్దరూ పొద్దున్నే లేచి పని చేసుకోవడానికి వెళ్లేవారు. సాయంత్రం కాగానే కాలక్షేపానికి ఆడిన పత్తాలాట.. చివరికి ప్రాణాలు తీసుకునే దగ్గరికి వెళ్లింది.

 • News18
 • Last Updated :
 • Share this:
  వాళ్లిద్దరూ వరుసకు మామా అల్లుళ్లు. ఉదయం లేవగానే ఊళ్లలోకి వెళ్లి... వెంట్రుకలను కొని వాటిని వేరే దగ్గర అమ్మి బతికేవారు. పొద్దంతా ఈ పని చేసిన తర్వాత సాయంత్రం కాగానే ఆహారాన్వేషణలో భాగంగా... ఎలుకలు, పందికొక్కులు, పిల్లులను వేటాడటం వీరి వృత్తి. ఆ పై మద్యం మత్తులో మునిగిపోవడం.. అదే క్రమంలో పేకాట ఆడటం వీరికి సరదా. రోజులిలా గడుస్తున్నాయి. మామా అల్లుడు ఇద్దరూ రోజూ పేకాటాడేవారు. అదే వ్యసనంగా మారింది. ఈ క్రమంలో.. అల్లుడు తరుచూ ఓడిపోవడం.. అందుకు సంబంధించిన డబ్బులేవీ అల్లుడు ఇవ్వకపోవడంతో ఆ మామకు ఆగ్రహం వేసింది. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో ఇక అతడిని ఖతం చేయాలనుకున్నాడు. అందులో భాగంగా అనుకున్న పనిని పూర్తి చేసి పోలీసులకు దొరికిపోయాడు.

  వివరాల్లోకెళ్తే... సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎంకేపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాంబాబు.. రాములు వరుసకు మామా అల్లుళ్లు. వీరిద్దరూ ఊరు ఊరు తిరిగి వెంట్రుకలకు వస్తువులను అమ్ముకుంటూ.. సాయంత్రం వేళల్లో జంతువులను వేటాడుతూ జీవనం కొనసాగించేవారు. అయితే ఈ క్రమంలో రాంబాబు చేతిలో అల్లుడు రాములు చాలాసార్లు ఓడిపోయాడు. అందుకు సంబంధించిన డబ్బులను రాములు ఇవ్వలేదు. ఆ అప్పు పెరిగి పెరిగి.. లక్ష రూపాయల దాకా చేరింది. ఆ అప్పు తీర్చాలని రాంబాబు చాలా సార్లు ఒత్తిడి తెచ్చేవాడు. రేపిస్తా.. మాపిస్తా అని రాములు చెప్పేవాడు.

  కాగా ఇక రాములు డబ్వులివ్వడనుకుని నిర్ధారించుకున్న రాంబాబు... మూడు రోజుల క్రితం.. అనగా ఈ నెల 27 న మందు తాగుదాం అని చెప్పి రాములును బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరూ ఫుల్లుగా మందు తాగారు. ఎంకేపల్లి శివారులో ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకుని.. కొంత మేర బాటిల్ లో నింపుకున్నాడు రాంబాబు. గ్రామ శివారులోకి వెళ్లగానే.. కొంత దూరం రహస్య ప్రదేశానికి తీసుకుపోయి.. వెనకనుంచి గట్టిగా బాదాడు రాంబాబు.

  మద్యం మత్తులో ఉన్న రాములు.. ఆ దెబ్బకు అక్కడే పడిపోయాడు. స్పృహ తప్పి ఉన్న రాములు పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు రాంబాబు. బతికుండగానే అతడిని సజీవదహనం చేశాడు. బాధితుడికి స్పృహా వచ్చి మొత్తుకుంటున్నా.. ప్రయోజనం లేకపోయింది. అగ్ని అప్పటికే అతడిని చుట్టుముట్టింది. అనంతరం ఏమీ ఎరగనట్లు నిందితుడు అక్కడ్నుంచి ఇంటికి జారుకున్నాడు. రాములు శవాన్ని చూసిన స్థానికులు.. దాని గురించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా నిందితుడిని ప్రశ్నించగా.. తానే నేరం చేశానని ఒప్పుకున్నాడు రాంబాబు. దీంతో పోలీసులు అతడిని కటకటాల వెనక్కి పంపారు.
  Published by:Srinivas Munigala
  First published: