హోమ్ /వార్తలు /క్రైమ్ /

మూడు నెలల క్రితం భార్య మృతి.. నిద్రపోతున్న ఇద్దరు పిల్లల చేతి మణికట్టు వద్ద కోసి ఆ తండ్రి చేసిన దారుణమిది..!

మూడు నెలల క్రితం భార్య మృతి.. నిద్రపోతున్న ఇద్దరు పిల్లల చేతి మణికట్టు వద్ద కోసి ఆ తండ్రి చేసిన దారుణమిది..!

వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ లంగర్ హౌజ్ ప్రాంతంలో నివసిస్తున్న హసీబ్ (38) హస్రత్‌లకు గత ఆరు 

సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా వారికి రెండు సంవత్సరాల ఇస్మాయిల్ తోపాటు 8 నెలల రెహాన్ 

అనే ఇద్దరు సంతానం ఉన్నారు.(ప్రతీకాత్మక చిత్రం

వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ లంగర్ హౌజ్ ప్రాంతంలో నివసిస్తున్న హసీబ్ (38) హస్రత్‌లకు గత ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా వారికి రెండు సంవత్సరాల ఇస్మాయిల్ తోపాటు 8 నెలల రెహాన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.(ప్రతీకాత్మక చిత్రం

నేను పిల్లల మణికట్టు వద్ద కత్తితో కోశా. వాళ్లను చంపేశా. ఇప్పుడు నేను కూడా చనిపోతున్నా. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా‘ అంటూ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అంతే నిద్రలోంచి అప్పుడే లేచిన వాళ్లకు జరిగిందేంటో తెలిసి షాకయ్యారు.

ఇంకా చదవండి ...

కొద్ది నెలల క్రితమే భార్య మరణించింది. ఏడేళ్లు, అయిదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులతో కలిసి ఆ భర్త తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఊహించని రీతిలో ఆ భర్త ఓ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిద్రపోతున్న ఇద్దరు కుమారుల చేతి మణికట్టు వద్ద కత్తితో కోశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఊరి చివర చెరువు వద్దకు వెళ్లాడు. ‘నేను పిల్లల మణికట్టు వద్ద కత్తితో కోశా. వాళ్లను చంపేశా. ఇప్పుడు నేను కూడా చనిపోతున్నా. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా‘ అంటూ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అంతే నిద్రలోంచి అప్పుడే లేచిన వాళ్లకు జరిగిందేంటో తెలిసి షాకయ్యారు. కొడుకు గదిలోకి వెళ్లి చూస్తే అప్పటికే ఓ పిల్లాడు మరణించాడు. మరో పిల్లాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. అతడు ఈ నిర్వాకానికి పాల్పడింది భార్యపై ప్రేమతోనో, ఆమె మరణించిందన్న ఆవేదనతోనో అనుకుంటే పొరపాటే. అసలు కథ వేరే ఉందండోయ్..

నాగర్ కర్నూలు జిల్లా నాగార్ కర్నూల్ మండలం మంతటి గ్రామానికి చెందిన ఎర్రమోని శివశంకర్, స్వప్న దంపతులకు ఏడేళ్ల మల్లికార్జున్, అయిదేళ్ల ప్రణయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శివశంకర్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసేవాడు. పెళ్లయి ఎనిమిదేళ్లు అయినా చాలా కాలం వరకు వారి కాపురం అన్యోన్యంగానే సాగింది. కొద్దికాలంగా శివశంకర్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన తర్వాత భార్యతో గొడవలు జరిగాయి. ఈ సమస్యల కారణంగానే మూడు నెలల క్రితం భార్య స్వప్న ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణం తర్వాత పిల్లలు ఇద్దరితోపాటు, తన తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే వివాహేతర సంబంధానికి తన ఇద్దరు పిల్లలు అడ్డుగా ఉన్నారని శివశంకర్ భావించాడు. వారిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పక్కాగా ప్లాన్ వేశాడు. భార్య మరణంతో బాధతోనే ఈ దారుణానికి తెగించాడన్న భావన అందరిలోనూ రావాలనుకున్నాడు.

ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

బుధవారం రాత్రి కూడా రోజూలాగానే తన పిల్లలు ఇద్దరితో కలిసి శివశంకర్ ఓ గదిలో, తన తల్లిదండ్రులు మరో గదిలో నిద్రపోయారు. గురువారం తెల్లవారుజామున ఇద్దరు పిల్లల చేతి మణికట్టు వద్ద కత్తితో కోసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ’నేను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా. ఇద్దరు పిల్లల చేతులను కూడా మణికట్టు వద్ద కోశాను. వాళ్లు కూడా చనిపోతారు‘ అని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వాళ్లు అప్రమత్తమయ్యారు. పిల్లలు పడుకున్న గదిలోకి వెళ్లి చూస్తే అప్పటికే ఏడేళ్ల మల్లికార్జున్ మరణించాడు. మరో బాబుకు తీవ్ర రక్తస్రావం కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు వెళ్లి చెరువు వద్ద ఉన్న శివశంకర్ ను పట్టుకుని గ్రామంలోకి తీసుకొచ్చారు. ఓ చెట్టుకు కట్టేసి చితకబాదారు. పోలీసుల విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Illegal affairs, Wife kill husband

ఉత్తమ కథలు