ఇంట్లోంచి భార్య మాయం.. ప్రియుడితో వెళ్లిందని తెలిసి వెతుక్కుంటూ వెళ్లిన భర్త.. చివరకు కథ అడ్డం తిరిగింది..!

ప్రతీకాత్మక చిత్రం

భార్య ఎక్కడకు వెళ్లిందో, ఎవరితో వెళ్లిందో తెలుసుకున్న భర్త, ఆమెను వెతుక్కుంటూ వెళ్లాడు. తన ప్రియుడితో ఆమె ఉన్న ఇంటికే వెళ్లాడు. వారితో గొడవ పడ్డాక భార్యను తనతో రప్పించేందుకు ఒప్పించలేక చివరకు తానే వెనక్కు తగ్గాడు

 • Share this:
  వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగింది. అయితే ఆ ప్రేమ జంట మధ్యలో ఓ మూడో వ్యక్తి వచ్చాడు. ప్రియుడి మోజులో ఆమె పడిపోయింది. భర్తను వదిలేసి ప్రియుడి వెంట వెళ్లిపోయింది. భార్య ఎక్కడకు వెళ్లిందో, ఎవరితో వెళ్లిందో తెలుసుకున్న భర్త, ఆమెను వెతుక్కుంటూ వెళ్లాడు. తన ప్రియుడితో ఆమె ఉన్న ఇంటికే వెళ్లాడు. వారితో గొడవ పడ్డాక భార్యను తనతో రప్పించేందుకు ఒప్పించలేక చివరకు తానే వెనక్కు తగ్గాడు. వారితో కలిసి ఉండేందుకు ఓకే చెప్పాడు. ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే వారి త్రిముఖ సంసారం ఎన్నో రోజులు సజావుగా గడవలేదు. అప్పటికే గర్భవతి అయిన ఆమెను ప్రియుడే చంపేశాడు. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హథ్రాస్ నగరానికి చెందిన సతీష్ కుమార్, ప్రీతికి నాలుగేళ్ల క్రితమే ప్రేమ పెళ్లి అయింది. ఏడాది క్రితం ఉపాధి నిమిత్తం హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ ప్రాంతానికి వలస వచ్చారు. అక్కడే నివసిస్తున్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన సుభాష్ తో ప్రీతీకి పరిచయం ఏర్పడింది. వీరి మధ్య ప్రేమ వ్యవహారం కొన్నాళ్లుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే సుభాస్ తో కలిసి ప్రీతి వెళ్లిపోయింది. భార్య సడన్ గా ఇంట్లోంచి మాయం అవడంతో భర్తకు ఏమయిందో అర్థం కాలేదు. చివరకు అసలేం జరిగిందో తెలిసి కంగుతిన్నాడు. తన భార్యను వెతుక్కుంటూ వెళ్లాడు.
  ఇది కూడా చదవండి: గురువారం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లో టెన్షన్ టెన్షన్.. దెయ్యం భయంతో ఇళ్లన్నీ ఖాళీ.. అసలు అక్కడ ఏం జరుగుతోందంటే..

  ఫరియాబాద్ లో తన భార్య ప్రీతి, ఆమె ప్రియుడు సుభాష్ ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్లాడు. తనతో తిరిగి రావాల్సిందిగా కోరాడు. అయితే ఆమె ససేమిరా అనడమే కాకుండా, కావాలంటే నువ్వే ఇక్కడ ఉండు అంటూ అనడంతో చివరకు సతీష్ వెనక్కు తగ్గాడు. తన భార్య, ఆమె ప్రియుడితో కలిసి ఉండేందుకు సతీష్ ఒప్పుకున్నాడు. వాళ్లు ముగ్గురూ కలిసి కొన్నాళ్లుగా జల్ విహార్ కాలనీలో కలిసి ఉంటున్నారు. ప్రీతి ఇటీవల గర్భవతి కూడా అయింది. అయితే ఫిబ్రవరి 19న సుభాష్ తన ప్రేయసి ప్రీతితో గొడవపడ్డాడు. ఆగ్రహంలో ఆమెను చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. భార్య చనిపోయి ఉన్నది చూసిన భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుభాష్ పట్ల అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు ఈ విషయమై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం సుభాష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
  2.3 కిలోల బంగారం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్.. చొక్కా జేబే పట్టించింది.. ఒకే ఒక్క మిస్టేక్ చేసి అడ్డంగా బుక్కయిన 108 సిబ్బంది
  Published by:Hasaan Kandula
  First published: