Home /News /crime /

మొండెం నుంచి 5 మీటర్ల దూరంలో ఎగిరిపడిన తల.. అసలు ఏం జరిగిందంటే..

మొండెం నుంచి 5 మీటర్ల దూరంలో ఎగిరిపడిన తల.. అసలు ఏం జరిగిందంటే..

ఖమ్మం జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వాహనం ప్రమాదానికి గురైంది.

ఖమ్మం జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వాహనం ప్రమాదానికి గురైంది.

రోజూవారీ లాగే గురువారం ఉదయం రైసుమిల్లులో విధులకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. దుర్గయ్య పనిచేసే రైసు మిల్లు కొద్దిదూరంలో ఉండగా, అదే మిల్లులో వరిపొట్టు నింపే డోజర్(ట్రాక్టర్) ఎదురుగా వచ్చి దుర్గయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఇంకా చదవండి ...
  ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా డోజర్(ట్రాక్టర్) ఢీకొట్టడంతో తల ఎగిరి ఐదు మీటర్ల దూరంలో పడింది. చూసేందుకు ఒళ్లు జంకే విధంగా మొండెం నుంచి తల వేరయ్యింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం ఉత్తులూరు గ్రామానికి చెందిన దుర్గయ్య(45) అల్లాదుర్గం మండలం రాంపూర్ శివారులోని రైసు మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నారు. రోజూవారీ లాగే గురువారం ఉదయం రైసుమిల్లులో విధులకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. దుర్గయ్య పనిచేసే రైసు మిల్లు కొద్దిదూరంలో ఉండగా, అదే మిల్లులో వరిపొట్టు నింపే డోజర్(ట్రాక్టర్) ఎదురుగా వచ్చి దుర్గయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య మొండెం నుంచి ఐదు మీటర్ల దూరంలో తల ఎగిరిపడింది.

  డోజర్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న దుర్గయ్య భార్య సావిత్రి, కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మొండెం నుంచి వేరైన తలను ఎదురుగా పెట్టుకుని రోదించడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. దుర్గయ్య భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Narsimha Badhini
  First published:

  Tags: Crime news, Medak, Police, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు