పొలం వద్ద హద్దు గొడవ.. ప్రాణం తీసింది..

కామారెడ్డి జిల్లాలో విష‌యం చోటుచేసుకుంది. పొలం ఒడ్డు విష‌యంలో ప‌డిన ఘ‌ర్ష‌ణలో ఓ రైతు మృతి చెందాడు.

news18-telugu
Updated: July 11, 2020, 5:30 PM IST
పొలం వద్ద హద్దు గొడవ.. ప్రాణం తీసింది..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కామారెడ్డి జిల్లాలో విష‌యం చోటుచేసుకుంది. పొలం ఒడ్డు విష‌యంలో ప‌డిన ఘ‌ర్ష‌ణలో ఓ రైతు మృతి చెందాడు. లింగంపేట మండల కేంద్రంలోని రాంపూర్ తండా గ్రామంలో పొలం గట్టు ఒడ్డు విషయంలో ఇరువురి రైతుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రైతులు ఘర్షణ పడగా ఈ ఘర్షణ లో దేవల పోచయ్యకు బలమైన గాయాలు అయ్యాయి. దీంతో ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దేవల పోచయ్య, దేవల బాబు మధ్య కొంత కాలంగా పొలం ఒడ్డు విషయంలో గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. శనివారం ఉదయం ఇద్ద‌రి మధ్య ఉన్న చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారింది. గొడవ కారణంగా ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఇట్టి విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజ్ శేఖర్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం కొరకు మార్చురీకి తరలించారు. కుటుంబస‌భ్యులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 11, 2020, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading