బీజేపీకి ఓటు వేసిందని భార్యను చంపేసిన భర్త

తాను చెప్పిన పార్టీకి ఓటు వేయలేదని తన భార్యను కర్రతో కొట్టిన చంపాడు ఆమె భర్త. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

news18-telugu
Updated: May 21, 2019, 2:29 PM IST
బీజేపీకి ఓటు వేసిందని భార్యను చంపేసిన భర్త
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. కానీ కొన్నిసార్లు ఇలాంటి గొడవలు హత్యలకు దారి తీస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి దారుణ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఘజీపూర్ నియోజకవర్గం పరిధిలోని స్వవానియా గ్రామంలో ఈ దారుణం జరిగింది. తన భార్య నీలంను బీఎస్పీకి ఓటు వేయాలంటూ ఆమె భర్త రాంబచ్ ఆదేశించారు. అయితే నీలం బీఎస్పీకి బదులుగా బీజేపీకి ఓటు వేసింది. ఓటు వేసిన అనంతరం తాను బీజేపీకి ఓటు వేశానని నీలం చెప్పడంతో రాంబచ్ ఆమెతో గొడవకు దిగాడు. ఆదివారం ఓటింగ్ పూర్తయిన తరువాత ఈ విషయంలో నీలం, రాంబచ్ మధ్య గొడవ జరిగింది.

ఆ మరుసటి రోజు కూడా ఇదే విషయంపై గొడవ జరగడంతో... రాంబచ్ ఆవేశంతో తన భార్యను కర్రతో కొట్టాడు. దెబ్బ బలంగా తగలడంతో నీలం అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమె అరుపులు విని చుట్టుపక్కల ఉన్న వాళ్లు అక్కడికి రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే బాధితురాలి తరపున బంధువులు మాత్రం ఈ హత్యకు అదనపు కట్నమే కారణమని ఆరోపించారు. కట్నం కోసమే నీలంను ఆమె భర్త చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు