షాపుకు వచ్చే వారితో మాట్లాడుతోందని భార్యను చంపిన భర్త

తన షాపుకు వచ్చే మగవారితో మాట్లాడుతోందనే అనుమానంతో భర్తను అతికిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త.

news18-telugu
Updated: June 20, 2019, 4:44 PM IST
షాపుకు వచ్చే వారితో మాట్లాడుతోందని భార్యను చంపిన భర్త
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనుమానం అతడి మనసులో విషబీజాలు నాటింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త... చివరకు ఆమెను కడతేర్చే వరకు విశ్రమించలేదు. దీంతో వారి కుటుంబం చిన్నాభిన్నమైంది. అనుమానం కారణంగా తన భార్య మెడకు తాడు బిగించిన ఆమె భర్త... కొనప్రాణంతో విలవిల్లాడుతున్న ఆమెను కత్తితో పొడిచి అతి దారుణం చంపేశాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని చిట్యాల గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... అన్నదేవరపేట గ్రామానికి చెందిన కప్పల రమాదేవి, కప్పల క్రాంతి కుమార్‌ 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉపాధి కోసం భార్యాభర్తలిద్దరూ అన్నదేవరపేట గ్రామాన్ని వదిలి హైదరాబాద్‌ వెళ్లారు.

అక్కడే పలు పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. నాలుగు నెలల క్రితం అన్నదేవరపేటలో రెండు నెలలు ఉండి, చిట్యాల గ్రామంలో సుమారుగా రెండు నెలల నుండి అద్దెకు ఉంటున్నారు. అక్కడే బండిపై బిర్యానీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే షాపుకు వచ్చే మగవారితో మాట్లాడుతోందన్న అనుమానంతో క్రాంతి కుమార్‌ తరచూ భార్యతో గొడవపడటం మొదలైంది. ఈ క్రమంలోనే భార్యపై అనుమానం పెంచుకున్న క్రాంతి కుమార్... తన కొడుకు, కూతురు స్కూలుకు వెళ్లిన తరువాత భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే ఆమె మెడకు తాడు బిగించి... కత్తితో పొడిచి చంపాడు. స్థానికులు అక్కడికి వచ్చేలోపే బాధితురాలు చనిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


First published: June 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు