పెళ్లి అయిన మూడు నెలలకే కట్టుకున్న భార్యను అనుమానంతో గొంతు పిసికి...

హర్ష, అన్షు మధ్య తరచుగా గొడవలు జరిగాయి. అక్టోబర్ 27న కూడా ఇదే విషయమై గొడవ పడ్డ సందర్భంలో అన్షుకు ఓ వాట్సప్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది సచినే అని భావించిన హర్ష పట్టలేని కోపంతో అన్షు గొంతు నులిమి హతమార్చాడు.

news18-telugu
Updated: November 3, 2020, 9:45 PM IST
పెళ్లి అయిన మూడు నెలలకే కట్టుకున్న భార్యను అనుమానంతో గొంతు పిసికి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను పెళ్లైన మూడు నెలలకే భర్త హతమార్చిన ఘటన కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్ష శర్మ(23), అన్షు(22) మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్షుకు హర్షతో పరిచయం కాకముందు సచిన్ అనే యువకుడితో ఆమె తల్లిదండ్రులు నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు. అయితే.. ఆ నిశ్చితార్థం జరగలేదు. అయితే నిశ్చితార్థం వరకూ వారి బంధం వెళ్లడంతో అన్షు సచిన్ ను మంచి స్నేహితుడిగా భావించింది. అతడితో తరచూ చాటింగ్ చేసేది. తన వైవాహిక జీవితం ముచ్చట్లను పంచుకునేది. అయితే హర్ష ఓపెన్ మైండెడ్ అనుకొని అన్షు అతడితో మాట్లాడేది. అయితే అన్షు తనతో పెళ్లి తర్వాత కూడా సచిన్‌తో సన్నిహితంగా ఉంటోందని తెలిసి హర్ష తట్టుకోలేకపోయాడు.. ఆ విషయంలో హర్ష, అన్షు మధ్య తరచుగా గొడవలు జరిగాయి. అక్టోబర్ 27న కూడా ఇదే విషయమై గొడవ పడ్డ సందర్భంలో అన్షుకు ఓ వాట్సప్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది సచినే అని భావించిన హర్ష పట్టలేని కోపంతో అన్షు గొంతు నులిమి హతమార్చాడు. పోలీసులు హర్షను అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.
Published by: Krishna Adithya
First published: November 3, 2020, 9:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading