ఉన్మాదిగా మారి ఇద్దరు పిల్లల్ని చంపేసి... తండ్రి ఆత్మహత్య

చిలకలూరి పేట పట్టణంలోని సుబ్బయ్యతోటలో చెందిన రమణ భార్య లక్ష్మీ, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.

news18-telugu
Updated: March 7, 2019, 11:18 AM IST
ఉన్మాదిగా మారి ఇద్దరు పిల్లల్ని చంపేసి... తండ్రి ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉన్మాదిగా మారిన ఓ తండ్రి తన ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చిలకలూరి పేట పట్టణంలోని సుబ్బయ్యతోటకు చెందిన రమణ భార్య లక్ష్మీ, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన రమణ...నిత్యం తాగొచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలోమంగళవారం రాత్రి కూడా భార్యతొ ఘర్షణకు దిగడంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. రోజూ లాగే నిన్నరాత్రి కూడా ఫుల్‌గా తాగొచ్చిన రమణ తన ఇద్దరు కుమారుల్ని కూడా గొంతుకోసి హతమార్చాడు. అనంతరం తాను కూడా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published: March 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు