చిన్న కారణానికే.. విచక్షణారహితంగా ఆ చిన్నారిని..

ఇటీవల ఓరోజు ముగ్గురు కలిసి బైక్‌పై బయటకు వెళ్లారు. తిరిగొస్తుండగా.. ఆ చిన్నారి బెలూన్ కొనివ్వమని సవతి తండ్రిని అడిగింది. అంతే.. తీవ్ర కోపోద్రిక్తుడైన అతను ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

news18-telugu
Updated: December 11, 2019, 9:07 PM IST
చిన్న కారణానికే.. విచక్షణారహితంగా ఆ చిన్నారిని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిన్న పిల్ల అన్న కనీస మానవత్వం లేకుండా కర్కషంగా వ్యవహరించాడో సవతి తండ్రి.ఆడుకునేందుకు బెలూన్ కావాలని అడిగినందుకు.. విచక్షణ మరిచి చావబాదాడు. చివరకు చిన్నారిని హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌‌లోని లక్నోలో ఉన్న కుల్దాబాద్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంది.అప్పటినుంచి తన కూతురితో పాటు అతనితో కలిసి ఉంటోంది.

ఇదే క్రమంలో ఇటీవల ఓరోజు ముగ్గురు కలిసి బైక్‌పై బయటకు వెళ్లారు. తిరిగొస్తుండగా.. ఆ చిన్నారి బెలూన్ కొనివ్వమని సవతి తండ్రిని అడిగింది. అంతే.. తీవ్ర కోపోద్రిక్తుడైన అతను ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అతన్ని అడ్డుకున్నందుకు భార్యను బైక్‌పై నుంచి దించి చిన్నారితో పాటు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి చేరుకున్నాక.. తలుపులు మూసి చిన్నారిపై మరోసారి దాడి చేశాడు. భార్య ఇంటికి చేరుకుని ఎంతసేపు తలుపులు కొట్టినా తీయలేదు.పోలీసులకు సమాచారం అందించగా.. స్థానికుల సాయంతో వారు తలుపులు బద్దలు కొట్టారు. అప్పటికే చిన్నారి మృతి చెందగా.. సవతి తండ్రి గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాడు. చిన్నారిని హత్య చేసి.. తనపై తానే దాడి చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Published by: Srinivas Mittapalli
First published: December 11, 2019, 9:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading