Home /News /crime /

MAN KILLED HIS MOTHER IN LAW AND INSERTED BAMBOO STICKS IN HER PRIVATE PARTS IN MUMBAI VILE PARLE SSR

Mother In Law: అత్తపై అల్లుడి ఉన్మాదం.. ప్రైవేట్ భాగాల్లో వెదురు కర్రలు బలంగా జొప్పించేసరికి బయటికొచ్చిన కిడ్నీ, లివర్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది. రానురానూ క్రూర మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. బంధాలు, అనుబంధాలు మరిచి విచక్షణ మరిచి కొందరు నర హంతకులుగా మారుతున్నారు. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో (Mumbai) జరిగిన ఓ ఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది.

ఇంకా చదవండి ...
  ముంబై: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది. రానురానూ క్రూర మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. బంధాలు, అనుబంధాలు మరిచి విచక్షణ మరిచి కొందరు నర హంతకులుగా మారుతున్నారు. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో (Mumbai) జరిగిన ఓ ఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. అల్లుడు(Son In Law) అత్తను(Mother In Law) అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆమె ప్రైవేట్ భాగాల్లో వెదురు కర్రలు (Bamboo Sticks) జొప్పించి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని విలే పార్లేకు(Vile Parle) చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఉండేవాడు. కొన్నేళ్ల క్రితం వీరికి పెళ్లైంది. పెళ్లి కాక ముందు నుంచి కూడా అల్లరిచిల్లరగా ఉన్న ఈ వ్యక్తి పెళ్లి తర్వాత కూడా తన తీరు మార్చుకోలేదు. మూడేళ్ల క్రితం ఓ చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతను జైలులోనే ఉన్నాడు.

  సెప్టెంబర్ 1న జైలు నుంచి విడుదలయ్యాడు. నేరుగా భార్యను చూసేందుకు ఇంటికి వెళ్లాడు. ఇంట్లో భార్య కనిపించలేదు. ఆమె మరొకరిని పెళ్లి చేసుకుందని, ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలుసుకుని నిందితుడు షాకయ్యాడు. అయినా ఆమెను తనతో తెచ్చుకోవాలని భావించి ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లాడు. తనతో ఇంటికి రావాలని ఆమెను కోరాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఎంత బతిమాలినా భార్య అతనితో వచ్చేందుకు ససేమిరా అనడంతో చేసేదేమీ లేక కోపంతో తిరిగి ఇంటికెళ్లిపోయాడు. మళ్లీ ఆమెను కలిసేందుకు తరువాత వెళ్లగా ఆమె ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.

  దీంతో.. ఏం చేయాలో అర్థం కాక మీ కూతురు ఎక్కడ ఉందో చెప్పాలంటూ అత్తను కలిసి అడిగాడు. తమ కూతురిని ప్రశాంతంగా ఉండనివ్వాలని, ఆమె జోలికి వెళ్లవద్దని ఆమె చెప్పింది. ఆమె ఎక్కడ ఉంటుందో చెప్పేందుకు అతని అత్త నిరాకరించింది. ఈ పరిణామంతో సదరు వ్యక్తికి కోపం కట్టలు తెంచుకుంది. అత్తాఅల్లుడి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఆమె తప్ప ఇంట్లో ఎవరూ లేరు. ఈ గొడవ కాస్తా చిలికిచిలికి గాలివానగా మారింది. క్షణికావేశంలో అత్తను తోసేశాడు. కిందపడిపోయిన ఆమెను కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న వెదురు కర్రలను తీసుకుని అత్త ప్రైవేట్ పార్టుల్లోకి ఉన్మాదంగా జొప్పించాడు. మరీ దారుణంగా, బలంగా వెదురు కర్రలను జొప్పించడంతో ఆమె శరీరంలోని కిడ్నీ, లివర్ బయటకొచ్చాయి. స్పాట్‌లోనే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

  ఇది కూడా చదవండి: Newlywed: ఇంటికొచ్చిన కొత్త కోడలు వాకిలి దగ్గర నిల్చుని అదే పనిగా బయటకు చూస్తుంటే అత్తకు ఏం అర్థం కాలేదు.. చివరికి..

  ఆమెను చంపేసి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే.. ఈ దారుణ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వెతుకులాట సాగించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని పుణెలో అదుపులోకి తీసుకున్నారు. ముంబై నగరంలో ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక మహిళపై సొంత అల్లుడే ఇంత దారుణానికి ఒడిగట్టడంతో విలే పార్లేలో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇంతటి ఉన్మాదానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Brutally murder, Crime news, Mumbai, Mumbai crime, Murder, Son in law

  తదుపరి వార్తలు