నా చెల్లికి పెళ్లి చేయొద్దు.. ఓ అన్న వింత ప్రవర్తన.. ఇంట్లో రోజూ గొడవ.. అడ్డుచెప్పిన తల్లిని చంపేశాడు.. అసలు కథేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లీడుకొచ్చిన చెల్లికి వివాహం జరుగుతోందని తెలిస్తే ఏ అన్నకయినా ఆనందమే. కానీ ఓ అన్నమాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. చెల్లికి పెళ్లి చేయొద్దని ఇంట్లో గొడవ పెట్టుకున్నాడు. తల్లిదండ్రులతో నిత్యం ఆమె పెళ్లి విషయంపైనే వాదులాట పెట్టుకున్నాడు.

 • Share this:
  పెళ్లీడుకొచ్చిన చెల్లికి వివాహం జరుగుతోందని తెలిస్తే ఏ అన్నకయినా ఆనందమే. తను ఓ ఇంటిది అయితే తల్లిదండ్రులతోపాటు అన్నయ్య కూడా ఆనందపడతాడు. పెళ్లి కార్యక్రమాలన్నింటినీ దగ్గర ఉండి మరీ చూసుకుంటాడు. భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని చెల్లికి భరోసా కల్పిస్తాడు. ధైర్యం చెబుతాడు. కానీ ఓ అన్నమాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. చెల్లికి పెళ్లి చేయొద్దని ఇంట్లో గొడవ పెట్టుకున్నాడు. తల్లిదండ్రులతో నిత్యం ఆమె పెళ్లి విషయంపైనే వాదులాట పెట్టుకున్నాడు. కారణం, ఆమెకు అధిక కట్నం ఇవ్వడానికి తల్లిదండ్రులు మొగ్గుచూపటమే. అంత కట్నం ఇస్తే తనకు ఏమీ మిగలదనుకున్నాడో ఏమో కానీ, చెల్లి పెళ్లికి ఎన్నో ఆటంకాలు సృష్టించాడు. చివరకు కన్న తల్లినే హతమార్చాడు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఖాజీపురం గ్రామానికి చెందిన పూనూరు అరుణ, పెద్ద వెంకటరెడ్డి దంపతులకు కుమారుడు హరీశ్ కుమార్ రెడ్డి, కుమార్తె కల్యాణి ఉన్నారు. హరీష్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఊళ్లోనే చిన్న చిన్నపనులు చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడుతున్నాడు. కూతురు కల్యాణీ బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుకుంటోంది. అయితే ఇటీవల కల్యాణికి పెళ్లి నిశ్చయించారు. త్వరలోనే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకోవాలనుకుంటున్నారు. అయితే పెళ్లికి గానూ కల్యాణికి అధిక కట్నం ఇచ్చేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపారు.
  ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకలో కలకలం.. భారీగా నగదు ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. వీడియో రికార్డు చేస్తున్న కెమెరాను పరిశీలించి కంగుతిన్న బంధువులు

  అంత మొత్తంలో పెళ్లి కానుకలు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఓకే చెప్పడంతో హరీశ్ కోపం పెంచుకున్నాడు. ఈ పెళ్లి చేయడానికి వీల్లేదని గొడవ పడ్డాడు. తరచూ ఇదే విషయమై తల్లిదండ్రులతో వాదనకు దిగేవాడు. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం పెళ్లి విషయమై తల్లితో గొడవ పడ్డాడు. తండ్రి అప్పటికే పొలం పనులకు వెళ్లగా, ఇంట్లో తల్లి, కుమారుడు మాత్రమే ఉన్నాడు. వంట పాత్రలు శుభ్రం చేస్తున్న తల్లితో వాదనకు దిగి, ఆ కోపంలో రోకలి బండతో ఆమె తలపై బాదాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అరుణను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మరణించింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. హరీశ్ కోసం గాలిస్తున్నారు.పెళ్లి జరగాల్సిన ఇంట్లో, చావు కార్యక్రమం నిర్వహించడం పట్ల బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు.
  ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రుల్లో అత్యధిక జీతం ఎవరికో తెలుసా..? కేసీఆర్, జగన్ వేతనాల్లో ఎంత తేడా ఉందంటే..!
  Published by:Hasaan Kandula
  First published: