శృంగారానికి ఒప్పుకోవడం లేదని, ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు...

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలో దారుణం... కొన్నాళ్ల వివాహేతర సంబంధం తర్వాత ప్రియుడితో తెగతెంపులు చేసుకున్న గృహిణి... ఆగ్రహంతో మహిళపై దాడి చేసి, నిప్పు పెట్టిన ప్రియుడు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 28, 2019, 8:43 PM IST
శృంగారానికి ఒప్పుకోవడం లేదని, ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు...
ప్రియురాలు అందుకు ఒప్పుకోవడం లేదని, పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు... (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 28, 2019, 8:43 PM IST
అతనికి ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లైన ఆమె, అతనితో వివాహేతర సంబంధం కూడా పెట్టుకుంది. కానీ ఏమైందో ఏమో వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ప్రియుడి కంటే భర్త ఎంతో గొప్పోడని తెలుసుకున్న ఆమె... అతన్ని దూరం పట్టింది. అయితే ఆమెతో ఆ సుఖానికి బాగా అలవాటు పడిన అతను, ప్రియురాలి ఎడబాటును తట్టుకోలేకపోయాడు. వివాహేతర సంబంధాన్ని తెంచేసుకున్న వివాహితపై పెట్రోల్ పోసి, తగులబెట్టాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని మహాల్ ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములు అనే యువకుడికి, అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరూ చాలారోజులు శారీరకంగా కలుసుకుంటూ, ఎంజాయ్ చేశారు.

అయితే కొన్నాళ్ల క్రితం ఇద్దరి మధ్యా గొడవలు జరిగాయి. గొడవ తర్వాత ప్రియుడికి దూరమైన ఆమె... భర్త ప్రేమకు దగ్గరైంది. తాను చేస్తున్న తప్పును తెలుసుకుని, రాములుతో మాట్లాడడం మానేసింది. అయితే ఆమెతో శారీరక సుఖానికి బాగా అలవాటు పడిన రాములు... ఆమెను వెంబడిస్తూ కోరిక తీర్చాల్సిందిగా వేధించడం మొదలెట్టాడు. అయితే ఆమె ఎంతకీ మాట వినకపోవడంతో ప్రియురాలిని చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. పథకం ప్రకారం కూలీపనులు ముగించుకుని, ఒంటరిగా వెళ్తున్న వివాహిత మహిళను వెంబడించాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను ఆపి, తన కోరిక తీర్చాల్సిందిగా కోరాడు. దానికి ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆవేశానికి లోనైన రాములు, ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. మంటలకు తాళలేక ఆమె కేకలు వేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు... మంటలు ఆర్పి, ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ గృహిణి ప్రాణాలు కోల్పోయింది. చనిపోయే ముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు... రాములు కోసం గాలిస్తున్నారు.

First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...