news18-telugu
Updated: November 25, 2020, 8:02 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ప్రేమించిన యువతితో జీవితాంతం కలిసి జీవించాలని కోరుకుంటారు అబ్బాయిలు. కానీ ఆ యువకుడు మాత్రం క్రూరంగా ఆలోచించాడు. ప్రేమించిన అమ్మాయి చనిపోవడానికి ఒప్పుకోలేదని కసి పెంచుకుని ఆమెను చంపేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన షాహిదా బేగం, రఘ మూడేళ్లు ప్రేమించుకున్నారు. అయితే ఇందుకు వాళ్ల పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని ప్రియురాలిని ఒప్పించాడు రఘు. అయితే ఈ విషయంలో ఆ తరువాత షాహిదా మనసు మార్చుకుంది.
రఘు పురుగుల మందు తాగినా... ఆమె మాత్రం అందుకు నిరాకరించింది. అప్పటి నుంచి షాహిదాపై పగ పెంచుకున్నాడు రఘు. తనతో కలిసి ఆత్మహత్య చేసుకోలేదనే కోపంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. అందుకే పెళ్లికి సిద్ధమవుతున్న షాహిదాను ఒకసారి మాట్లాడాలని పిలిపించాడు. ఈ నెల 17న రాత్రి సమయంలో మాట్లాడాలని నమ్మించి బయటకు తీసుకెళ్లాడు. యువతి తల్లిదండ్రులు రఘును షాహిదా గురించి ప్రశ్నించారు. అతడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తుంబిగనూరు సమీపంలోని హెచ్చెల్సీ కాలువలో షాహిదా బేగం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రఘును అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 25, 2020, 8:02 AM IST