ప్రేమించిన అమ్మాయితో వెళ్లపోయిన యువకుడు.. కానీ పెళ్లి చేసుకునే సమయానికి..

(ప్రతీకాత్మక చిత్రం)

చయ్యాబాయ్ అనే అమ్మాయి కొద్దిరోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిన తమ అమ్మాయి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు.

 • Share this:
  ఆ అమ్మాయిని అతడు ప్రేమించాడు. నీతోనే నా జీవితమని ఆమెకు చెప్పాడు. ఆమెను తన ప్రేమలోకి దించాడు. ఆమెతో జీవితం పంచుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం ఊళ్లో ఉన్న తన భూమి అమ్ముకుని మరో చోట ఇంటిని కూడా కట్టుకున్నాడు. అంతా అనుకున్నట్టే జరిగింది. ఆ అమ్మాయి అతడితో వచ్చేసింది. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అన్న తరుణంలో అనుకోని ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చయ్యాబాయ్ అనే అమ్మాయి కొద్దిరోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిన తమ అమ్మాయి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. తమకు సొంత గ్రామానికి చెందిన సంతోష్ గోల్కర్ మీద అనుమానం ఉందని తెలిపారు.

  దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కొద్దిరోజుల తరువాత నిందితుడిని గుర్తించాడు. అతడి దగ్గర యువతి లేకపోవడాన్ని గమనించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో నిందితుడు విస్తుపోయే వాస్తవాలు వెల్లడించాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఇల్లు కొనుక్కున్నానని వారికి చెప్పాడు. కానీ చివరి నిమిషంలో తనకు ఆమెకు అనుమానం కలిగించిందని వివరించాడు. ఆ కారణంగా ఆమెను చంపేశానని అన్నాడు.

  ఆమెను ఏ రకంగా చంపాననే విషయాన్ని కూడా పోలీసులకు తెలిపాడు. బాధితురాలిని ఇంట్లో వాటర్ ట్యాంక్ కోసం తవ్వని గుంతలోనూ పాతిపెట్టానని.. ఇందుకు తన తల్లితో పాటు మరో బంధువు కూడా సహకరించారని పోలీసులకు వివరించాడు. నిందితుడు చెప్పిన వివరాలతో అతడు చెప్పిన చోట తవ్వి బాధితురాలి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు.. నిందితుడితో పాటు హత్యలో అతడికి సహకరించిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: