Crime: ఇంత చిన్న కారణానికే హత్యా..? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు.

Crime: ఇంత చిన్న కారణానికే హత్యా..? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు.

ప్రతీకాత్మక చిత్రం

సిభరామ్ దాస్ ను హత్య చేసిన దుర్బధన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

  • Share this:
    చిన్నపాటి తగదా ఏకంగా హత్యకు దారి తీసింది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని అడిగిన పాపానికి ఓ వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. తర్వాత దర్జాగా సొంతూరు వెళ్లిపోయాడు. నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని  స్థానికులు గుర్తించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన సిభరామ్ దాస్, దుర్బధన్ ఉపాధి కోసం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు వచ్చారు. ఓ తాపీ మేస్త్రి వద్ద ఇద్దరూ కూలిపనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిభరరామ్ దాస్ వద్ద.. దుర్బధన్ రూ.వెయ్యి అప్పుగా తీసుకున్నాడు. అందులో రూ.500 తిరిగిచ్చేశాడు. మరో రూ.500 ఇవ్వడంలో ఆలస్యం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. చిన్న గొడవ కాస్తా మాటామాటా పెరగడంతో ఘర్షణ జరిగింది.

    ఆ గొడవలో దుర్బధన్.. సిభరామ్ ను కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని వారు ఉంటున్న ఇంటివెనుక పొదల్లో పడేసి స్వగ్రామానికి పారిపోయాడు. నాలుగు రోజుల తర్వాత పొదల్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించిన పోలీసులకు తొలుత హత్యకు గల కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. దాదాపు వారం రోజుల పాటు వివిధ కోణాల్లో విచారించగా రూ.500 కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో సిభరామ్ ను దుర్బధన్ హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చి అతన్ని విచారించగా రూ.500 కోసం జరిగిన గొడవ కారణంగానే హత్య చేసినట్లు చెప్పాడు.

    రూ.500 కోసం నిండు ప్రాణాన్ని బలితీసుకున్న దుర్బధన్ నపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్న కారణాలకే క్షణికావేశంలో తీవ్రనేరాలకు పాల్పడటం ఇటీవల తరచుగా చోటు చేసుకుంటోంది. గతంలో ఓ వ్యక్తి రూ.20 విషయంలో గొడవ జరిగి మరో వ్యక్తిని హత్య చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
    Published by:Purna Chandra
    First published: