పిన్నితో కొడుకు శృంగారం చేస్తూ...అడ్డంగా దొరికిపోయాడు...వద్దన్నందుకు దారుణంగా...

వరుసకు పిన్ని అయ్యే యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బంధువులకు తెలియడంతో సోనీ భర్త సోహన్ లాల్ మందలించాడు.

news18-telugu
Updated: May 23, 2020, 7:20 PM IST
పిన్నితో కొడుకు శృంగారం చేస్తూ...అడ్డంగా దొరికిపోయాడు...వద్దన్నందుకు దారుణంగా...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
వరుసకు పిన్ని అయ్యే మహిళతో వివాహేతర సంబంధం నెరిపాడు. విషయం తెలుసుకున్న పెద్దలు పంచాయితీ పెట్టి తీరు మార్చుకోవాలన్నారు. అయినా మారలేదు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చిన్నాన్న వరసయ్యే వ్యక్తిని చంపేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేసి విఫలమయ్యాడు. చివరకు ఇద్దరూ కటకటాలపాలయ్యారు. యూపీలోని గోరఖ్ పూర్ కు చెందిన పంకజ్ (26) స్థానికంగా చిన్న వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడిడు తమ సమీప గ్రామానికి చెందిన సోనీతో పరిచయం ఏర్పడింది. వరుసకు పిన్ని అయ్యే యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బంధువులకు తెలియడంతో సోనీ భర్త సోహన్ లాల్ మందలించాడు. బంధువుల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. తీరు మార్చుకోవాలని పెద్దల పంకజ్ కు సూచించినా ఫలితం కనిపించలేదు. తమ బంధానికి అడ్డుగా ఉన్న సోహన్ లాల్ ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని వేచి చూశారు.

పంకజ్ స్థానిక ఫర్టిలైజర్‌ దుకాణానికి వెళ్లి ఎలుకలను చంపే మందును తీసుకున్నాడు. సోహన్ లాల్ తాగే మద్యంలో కలపమని సోనీని సూచించాడు. పథకం ప్రకారం సోనీ మద్యంలో ఎలుకల మందు కలిపింది. దీంతో సోహన్ లాల్ అస్వస్థతకు గురై మృతిచెందాడు. అనంతరం సోహల్ మృతదేహాన్ని అటవీ ప్రాంతంలోని చెట్ల పొదల్లో పడేశారు. రెండు రోజుల తర్వాత హత్య విషయం వెలుగుచూసింది. ఎస్‌ఐ జాదవ్‌ కేసు దర్యాప్తు చేశారు. సోహన్ లాల్ కనుబడట లేదని సోనీ కంప్లైంట్ ఇచ్చింది. అయితే రెండో రోజే అతడి మృతదేహం దొరికింది. దీంతో హత్యతో సోనీకి సంబంధం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ జాదవ్‌ ఆధ్వర్యంలో విచారణ జరుపగా హత్యగా నిర్ధారించారు. ఈమేరకు సోని, పంకజ్ లను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయగా హత్య విషయం అంగీకరించడంతో రిమాండుకు పంపారు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading