• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN KILLED GROCERY SHOP OWNER FOR NOT GIVING PAN MASALA IN BIHAR AK

పాన్ మసాలా ఇవ్వలేదని గొడవ.. మరుసటి రోజు తుపాకీ తీసుకొచ్చి కాల్పులు

పాన్ మసాలా ఇవ్వలేదని గొడవ.. మరుసటి రోజు తుపాకీ తీసుకొచ్చి కాల్పులు

ప్రతీకాత్మక చిత్రం

అంతకుముందు రోజే అజిత్ కుమార్ ఆ కిరాణా కొట్టు యజమానితో పాన్ మసాలా కోసం గొడవ పడ్డాడని స్థానికులు తెలిపారు.

  • Share this:
    తాను అడిగిన విధంగా పాన్ మసాలా ఇవ్వలేదని ఏకంగా కిరాణాకొట్టు వ్యాపారిని చంపేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన బీహార్‌లోని త్రివేణిగంజ్‌లో చోటు చేసుకుంది. తన దగ్గర డబ్బు లేదని.. 20 రూపాయల పాన్ మాసాలా ఉద్దెర ఇవ్వాలని అజిత్ కుమార్ కిరాణ షాపు యజమాని చిన్న కుమారుడు మితిలేష్‌ను కోరాడు. అయితే ఇందుకు అతడు నిరాకరించాడు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న అజిత్ కుమార్.. ఆ మరుసటి రోజు తుపాకీ తీసుకుని వచ్చి మితిలేషన్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే అంతకుముందు రోజే అజిత్ కుమార్ ఆ కిరాణా కొట్టు యజమానితో పాన్ మసాలా కోసం గొడవ పడ్డాడని స్థానికులు తెలిపారు.

    ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న తుపాకీ తీసుకుని షాపు యజమాని కుమారుడిని కాల్చి చంపాడు. ఘటన జరిగిన వెంటనే కుటుంబసభ్యులు కిరాణ కొట్టు దగ్గరకు వచ్చారు. అయితే అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి కోసం బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. నిందితులను తాము గుర్తించామని.. వారి కోసం వేట కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు