MAN KILLED GIRL AND INJURED HER MOTHER AFTER SHE BROKE FRIENDSHIP ON FACEBOOK PVN
OMG : ఫేస్ బుక్ లో మెసేజ్ లకు కు రిప్లై ఇవ్వట్లేదని..ఇంటికెళ్లి యువతిని కత్తితో పోడిచి చంపేశాడు!
యువకుడి కత్తి దాడిలో చనిపోయిన సోనమ్
Man killed girl and injured her mother : ఉత్తరప్రదేశ్లోని మథురలో దారుణం జరిగింది. మథురలోని ఠాణా హైవే ప్రాంతంలో ఉన్న నాగ్లా బోహ్రా ప్రాంతంలో ఓ యువకుడు... తన పెళ్లి కార్డు ఇస్తానని చెప్పిఅదే ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువతి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం తనవెంట తెచ్చుకున్న కత్తితో యువతి,ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు.
Man killed girl and injured her mother : ఉత్తరప్రదేశ్(UttarPradesh)లోని మథురలో దారుణం జరిగింది. మథురలోని ఠాణా హైవే ప్రాంతంలో ఉన్న నాగ్లా బోహ్రా ప్రాంతంలో ఓ యువకుడు... తన పెళ్లి కార్డు ఇస్తానని చెప్పిఅదే ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువతి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం తనవెంట తెచ్చుకున్న కత్తితో యువతి,ఆమె తల్లిపై కత్తి(Knife)తో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చనిపోగా, తల్లికి గాయాలయ్యాయి(Injured). ఇద్దరిపై దాడి అనంతరం యువకుడు యువకుడు తనను తాను పొట్టలో పొడిచుకున్నాడు. దీంతో అతను కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం బాధితురాలి తల్లి, నిందితుడైన యువకుడు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇంట్లో తల్లి, కూతురు ఒంటరిగా
ఆదివారం సాయంత్రం, నాగ్లా బోహ్రా నివాసి రిటైర్డ్ సైనికుడు తేజ్వీర్ ఇంట్లో అతని భార్య సునీత మరియు 17 ఏళ్ల కుమార్తె సోనమ్ ఒంటరిగా ఉన్నారు. ఈ సమయంలో, ముజఫర్నగర్లోని కొత్త మండి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకుడా నివాసి శివమ్ అలియాస్ అభి కశ్యప్..ఇంటి తలుపు తట్టాడు. అతడి కోసం తలుపులు తీయడానికి వచ్చిన సోనమ్ పై అక్కడే కత్తితో దాడి చేశాడు అభి కశ్యప్. అనంతరం కూతురిని రక్షించేందుకు తల్లి సునీత రావడంతో ఆమెను కూడా కత్తితో పొడిచాడు. తల్లీకూతుళ్లకు గాయాలవడంతో ఆ యువకుడు కూడా తనను తాను కడుపులో కత్తితో పొడుచుకుని అక్కడే పడిపోయాడు.
అరుపులు విని ఇరుగుపొరుగు వారు ఘటనా స్థలానికి
వారి కేకలు విన్న చుట్టుపక్కల వారు కూడా అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..సోనమ్ అప్పటికే చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. కొన ఊపిరితో యువతి తల్లి,నిందితుడు ఉండటాన్ని గమనించారు. గ్రామస్తుల సాయంతో గాయపడిన సునీత, యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో పంచనామా చేసి సోనమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ విషయమై నగర ఎస్పీ మార్తాండ్ ప్రకాష్ సింగ్ మాట్లాడుతూ.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో విచారణ కుదరలేదు. ఆధార్ కార్డు ద్వారా కూడా యువకుడిని గుర్తించారు. ఘటన వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ఫేస్ బుక్ స్నేహం
మృతురాలు సోనమ్ కి, నిందితుడు అభి కశ్యప్ మధ్య ఫేస్బుక్ (Facebook)సంభాషణ జరిగినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. ఫేస్బుక్ ద్వారా ఇద్దరి మధ్య స్నేహం ఉందని మృతురాలి చెల్లెలు చెప్పిందని, అయితే కొద్దిరోజులుగా అభితో మాట్లాడేందుకు సోనమ్ ఇష్టపడటంలేదని,అతడి మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం లేదని..ఈ కోపంతోనే నిందితుడు ఈ పని చేశాడని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అజయ్ కౌశల్ తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.