ప్రియురాలిని వదిలించుకోవడానికి దారుణం.. వనపర్తి జిల్లాలో సంచలనం

వనపర్తి జిల్లా అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలో కానాపూర్ కు చెందిన యువతి హత్య కేసులో నిందితుడు ఒక్కడే అని వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

news18-telugu
Updated: November 13, 2020, 6:25 PM IST
ప్రియురాలిని వదిలించుకోవడానికి దారుణం.. వనపర్తి జిల్లాలో సంచలనం
శ్రీనివాస్, శ్వేత
  • Share this:
ఎనిమిది సంవత్సరాల పాటు ప్రేమించిన యువతిని కాదని, తన తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఓ యువకుడు వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి తేవడంతో యువకుడు దారుణానికి తెగబడ్డాడు. వనపర్తి జిల్లాలో ఈ ఘటన జరిగింది. అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలో కానాపూర్ కు చెందిన యువతి హత్య కేసులో నిందితుడు ఒక్కడే అని వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 2012 నుంచి శ్వేత, శ్రీనివాసులు ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఆయన అన్నారు. ఇటీవల లాక్ డౌన్ సమయంలో శ్రీనివాసులు ఇంట్లో ఒత్తిడి చేయడంతో తమ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది జీర్ణించుకోలేని శ్వేత తరచూ శ్రీను కు ఫోన్ చేసేది. తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసేది. ఈ క్రమంలో శ్వేతను వదిలించుకోవటం ఒక్కటే మార్గమని భావించాడు శ్రీనివాసులు. హైదరాబాద్ నుంచి వస్తున్న శ్వేతను జడ్చర్ల వద్ద బస్ దిగమని చెప్పాడు. తన బైక్ లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించాడు. జడ్చర్ల నుంచి ఆమెను బైక్ పై మహబూబ్ నగర్, దేవరకద్ర, మరికల్, అమరచింత మీదుగా తండా వైపు వెళ్లాడు. ఆ సమయంలో మరోసారి తన పెళ్లి ప్రస్తావన చేసిందని తెలిపారు. శ్రీనివాసులు భార్య కు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే బజారుకు ఈడ్చి ధర్నా చేస్తానని, ‘నీకు నిద్ర పట్టని రాత్రులు చేస్తా’నని ఆమె తీవ్రంగా హెచ్చరించినట్లు డీఎస్పీ తెలిపారు. దీంతో శ్రీను తన వెంబడి తీసుకువచ్చిన తాడుతో గొంతుకు ఉరి వేసి చపేశాడు. ఆ తర్వాత పత్తి చేనులోకి ఈడ్చు కెళ్లి చనిపోయిందని నిర్దారించుకొన్నాడు. తన బండి లో ఉన్న పెట్రోల్ ను తీసి ఆమె మృతదేహాన్ని కాల్చి వేశాడాని డీఎస్పీ తెలిపారు.

నేరస్థుడిని పట్టించిన అక్షర దోషాలు.. కటకటాల వెనక్కి హంతకుడు

యూపీలోని హర్దోయ్ కు చెందిన రామ్ ప్రతాప్ సింగ్ అక్టోబర్ 26న ఒక బాలుడిని కిడ్నాప్ చేశాడు. బాలుడిని వదిలేయాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందులో భాగంగానే ఆ బాలుడి తండ్రికి ఫోన్ లో మెసేజ్ పెట్టాడు. బాబును వదిలేయాలంటే రూ. 2 లక్షలు ఇవ్వాలని, పోలీసులకు ఈ విషయం చెబితే చంపేస్తానని చెప్పాడు. డబ్బులను ఎక్కడికి తీసుకురావాలో కూడా మెసేజ్ లోనే వివరంగా రాశాడు. అయితే ఆ సందేశమే అతడిని పట్టించింది.

బాలుడి తండ్రి ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు సదరు ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా అది స్విచాఫ్ అని వచ్చింది. నెంబర్ ఆధారంగా పోలీసులు తమదైన రీతిలో వివరాలు ఆరా తీయగా.. ఆ ఫోన్ కూడా దొంగిలించేదనని తేలింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఒక పదిమందిని పట్టుకొచ్చారు. వారికో చిన్న టెస్ట్ పెట్టారు. ‘నాకు పోలీస్ ఉద్యోగం కావాలి. అందుకోసం హర్దోయ్ నుంచి సీతాపూర్ వరకు పరిగెత్తగలను..’ అనే మెసేజ్ హిందీలో రాయాలని చెప్పారు. అందరూ రాశారు. అందులో ఒక వ్యక్తి ‘పోలీస్’.. ‘సీతాపూర్’ అనే పదాలను తప్పుగా రాశాడు. అంతే.. దొంగ దొరికాడు. బాలుడి తండ్రికి మెసేజ్ పెట్టినప్పుడు కూడా దొంగ.. పోలీస్ అనే పదాన్ని ‘పోలీష్’ అని రాశాడు. సీతాపూర్ అనే పదంలోనూ అక్షర దోషాలున్నాయి. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దాంతో ఆ హంతకుడు నిజం ఒప్పుకున్నాడు. బాలుడి గురించి అడగ్గా.. తన తండ్రి డబ్బులివ్వకపోయేసరికి చంపేశానని చెప్పాడు. ఇది విన్న ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ హంతకుడిని కటకటాల వెనక్కి నెట్టారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 13, 2020, 5:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading