రూ. 200 కోసం దారుణం.. కాల్పుల్లో వ్యక్తి మృతి

200 రూపాయల కోసం జరిగిన ఘర్షణ ఓ వ్యక్తిని దారుణ హత్యకు కారణమైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: October 5, 2020, 3:56 PM IST
రూ. 200 కోసం దారుణం.. కాల్పుల్లో వ్యక్తి మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
200 రూపాయల కోసం జరిగిన ఘర్షణ ఓ వ్యక్తిని దారుణ హత్యకు కారణమైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడిని ఉషైత్ ప్రాంతంలోని లీలా నాగ్ల గ్రామానికి చెందిన విక్రమ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. విక్రమ్ సోదరుడు మిథున్ ఆదివారం సాయంత్రం అదే ఊరిలోని సురేష్, సుబేష్ అనే వ్యక్తులకు చెందిన ఇంట్లో కూలీ పనికి వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత మిథున్ తనకు ఇవ్వాల్సిన 200 రూపాయలు అడిగాడు. దీంతో ఆ ఇంటివాళ్లకు మిథున్ మధ్య ఘర్షణ మొదలైంది. గొడవ కాస్త పెద్దదిగానే జరిగింది.

దీంతో గ్రామస్థులు కలిపించుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే సురేష్, సుభేష్ మాత్రం దానిని అంతటితో వదిలిపెట్టలేదు. అదేరోజు అర్ధరాత్రి సమయంలో మిథున్ ఇంటికి వెళ్లారు. వెళ్లగానే మిథున్ ఇంటిపైకి కాల్పులకు దిగారు. అయితే ఈ ఘర్షణలో మిథున్ సోదరుడు విక్రమ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విక్రమ్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి నిందితులు సురేష్, సుబేష్‌లపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిద్దరి ఆచూకీ కోసం గాలింపు చేపట్టామని చెప్పారు.
Published by: Sumanth Kanukula
First published: October 5, 2020, 3:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading