వివాహేతర సంబంధం కొనసాగించేందుకు నిరాకరించిన యువతిని అతిదారుణంగా కొట్టి చంపాడు ఓ యువకుడు. యువతి మరొకరిని పెళ్లి చేసుకోబోతోందనే కోపంతో ఆమెను అతి దారుణంగా హింసించాడు. అతడి హింసను తట్టుకోలేకపోయిన ఆ యువతి చివరకు ప్రాణాలను వదిలింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... 22 ఏళ్ల మోను... తన కజిన్ మీరుట్ తో కలిసి పంజాబ్లోని షామ్లీలో కూలీగా పని చేస్తున్నాడు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది కొంతకాలం కొనసాగింది. అయితే ఆ తరువాత మీరుట్ ఈ సంబంధాన్ని కొనసాగించేందుకు నిరాకించింది. దీంతో మోను ఆగ్రహంతో రగిలిపోయాడు.
వివాహేతర సంబంధం కొనసాగించాలని పట్టుబట్టాడు. ఇందుకు ఆ యువతి ఒప్పుకోకపోవడంతో... సమీపంలోని చెరుకు తోటలోకి బలవంతంగా లాక్కెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను అతిదారుణంగా కొట్టాడు. నిందితుడి దెబ్బలకు తాళలేకపోయిన యువతి మీరుట్... అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. సోమవారం ఉదయం యువతి మృతదేహాన్ని గమనించిన స్థానికులు... విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించిన పోలీసులు... పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తరువాతే హత్యపై మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.