వివాహేతర సంబంధం కారణం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పల్లిపాలెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకు అదే గ్రామానికి చెందిన సుశీలతో కొన్నేళ్లకు వివాహేతర సంబంధం ఉంది. దీనిపై పలుసార్లు గొడవలు కూడా జరిగాయి. పెద్దలు పంచాయతీ పెట్టినా... వెంకటేశ్వర్లు మాత్రం తన వివాహేతర సంబంధానికి ముగింపు పలకలేదు. అయితే ఇటీవల వారిద్దరి మధ్య చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. ఇదే అదునుగా భావించిన సుశీల కొడుకులు దుర్గప్రసాద్, నాని తన తల్లి సహకారంతో వెంకటేశ్వర్లును పథకం ప్రకారం ఇంటికి రప్పించారు. అతడితో గొడవకు దిగారు.
అనంతరం ఇద్దరూ కలిసి వెంకటేశ్వర్లును కర్రతో కొట్టారు. అనంతరం వెంకటేశ్వర్లును బైక్పై పక్కనే ఉన్న కరకట్టపైకి తీసుకెళ్లి అక్కడ వదిలేసి వచ్చారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు కొడుకు తన తండ్రిని భీమవరం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా... మార్గమధ్యంలోనే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో వెంకటేశ్వర్లు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.