హోమ్ /వార్తలు /క్రైమ్ /

కాపురానికి రాలేదని భార్యను గొడ్డలితో నరికిచంపిన భర్త.. గ్రామస్తులంతా కలిసి..

కాపురానికి రాలేదని భార్యను గొడ్డలితో నరికిచంపిన భర్త.. గ్రామస్తులంతా కలిసి..

భార్యను హత్య చేసి ఊరి నుంచి పారిపోతున్న నసీర్‌ను స్థానికులు చితకబాదారు. కర్రలు, రాళ్లతో కట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

భార్యను హత్య చేసి ఊరి నుంచి పారిపోతున్న నసీర్‌ను స్థానికులు చితకబాదారు. కర్రలు, రాళ్లతో కట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

భార్యను హత్య చేసి ఊరి నుంచి పారిపోతున్న నసీర్‌ను స్థానికులు చితకబాదారు. కర్రలు, రాళ్లతో కట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

  కాపురానికి రావడం లేదన్న కోపంతో భార్యను గొడ్డలితో నరికి చంపడు భర్త. అడ్డొచ్చిన వారిపైనా దాడికి పాల్పడ్డాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు అతడిని చితకబాది చంపేశారు. యూపీలోని ఫతేపూర్ జిల్లా సెమోర్‌‌లో ఈ ఘోరం జరిగింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన 40 ఏళ్ల నసీర్‌ ఖురేషి.. 9 ఏళ్ల క్రితం సెమోర్‌ గ్రామానికి చెందిన పప్పి అలియాస్ అఫ్జారీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పప్పీ గత ఏడు నెలలుగా పుట్టినింట్లో తల్లిదండ్రులతో నివసిస్తోంది. కాపురానికి రావాలని పలుమార్లు భర్త కోరినా ఆమె వినిపించుకోలేదు. భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు ఇటీవలే నసీర్ అత్తింటికి వెళ్లాడు.

  ఈ క్రమంలో బుధవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తింది. కాపురానికి రానని భార్య మొండికేయడంతో చేయి చేసుకోబోయాడు భర్త. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు నచ్చజెప్పడంతో అప్పటి వరకు గొడవ సద్దుమణిగింది. ఇక మధ్యాహ్నం భర్త నసీర్‌కు పప్పీ భోజనం తీసుకొచ్చింది. ఆ సమయంలో భార్య గొడ్డలితో దాడి చేశాడు నసీర్. అడ్డొచ్చిన కూతురు, అత్తపైనా దాడికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల ప్రజలు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసినా అతడు వినలేదు. గొడ్డలి చూపించి వారినీ బెదిరించాడు. తీవ్ర గాయాలతో అప్పటికే అతడి భార్య చనిపోయింది.

  భార్యను హత్య చేసి ఊరి నుంచి పారిపోతున్న నసీర్‌ను స్థానికులు చితకబాదారు. కర్రలు, రాళ్లతో కట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులను అడిగిని వివరాలు తెలుసుకున్నారు. పప్పి, నసీర్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఊరిలో రెండు హత్యలు జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

  First published:

  Tags: Crime news, Husband kill wife, Murder, Uttar pradesh

  ఉత్తమ కథలు