దేవుడి గుడి వద్ద దారుణం.. తోడబుట్టిన వారిపైనే..

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద‌ఛాయ‌లు ఆలుముకున్నాయి.

news18-telugu
Updated: October 12, 2019, 7:54 PM IST
దేవుడి గుడి వద్ద దారుణం.. తోడబుట్టిన వారిపైనే..
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య
news18-telugu
Updated: October 12, 2019, 7:54 PM IST
కామారెడ్డి జిల్లాలో దారుణం జ‌రిగింది.. ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హ‌త్యకు గుర‌య్యారు. విగ‌త జీవులుగా ప‌డిపోయారు.. ఈ హృద‌య విదార‌క‌ ఘ‌ట‌న‌ దోమకొండ మండల కేంద్రంలోని మల్లయ్య దేవాలయం ప్రాంతంలో వెలుగు చూసింది. సోదరుని కూతురు ప్రేమ వివాహం చేసుకోవ‌డం న‌చ్చ‌కపోవ‌డంతో పాటు ఆస్థి తగాదాలు కుటుంబంలో చిచ్చురేపాయి. చివరికి తోడబుట్టిన అన్నను, అతడి కూతుళ్లను త‌మ్ముడు దారుణంగా చంపాడు. కామారెడ్డి జిల్లా దోమ‌కొండ గ్రామ శివారులోని మ‌ల్ల‌య్య దేవాల‌యం ప్రాంత‌వంలో మూడు శ‌వాలు ప‌డి ఉన్నాయి. గ్రామస్తుల స‌మాచారంతో పోలీసులు సంఘ‌ట‌న స్థలానికి చేరుకొని విచారించారు. మృతులు బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన బాలయ్య (40), చందన (5), లత (15)లుగా గుర్తించారు.. వీరిని బ్లేడుతో గొంతు కోసి దారుణంగా హత్య చేసినన‌ట్లు పోలీసులు గుర్తించారు.

కొద్ది రోజుల క్రితం బాల‌య్య కూతురు ల‌త ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ విష‌యంలో విభేదించిన బాలయ్య తమ్ముడు రవి అన్న‌తో గొడ‌వ ప‌డ్డాడు. ప‌రువు పోతుంద‌ని వాదించాడు. అయితే, బాల‌య్య దాన్ని పట్టించుకోలేదు. చివ‌ర‌కు ఆస్థి విష‌యంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో ఆగ్ర‌హించిన ర‌వి అన్న బాల‌య్య అడ్డు తొల‌గించుకోవాల‌ని ప‌థ‌కం వేసాడు. అన్నను, అన్న ఇద్దరు కూతుళ్లను తీసుకోని దోమ‌కొండ‌కు తీసుకు వెళ్లి కూల్ డ్రింక్ లో పురుగుల మందు క‌లిపి తాగించాడు. బాల‌య్య ఇద్ద‌రు కూతుళ్లు స్పృహ కోల్పోయారు. ఇదే ఆదునుగా బావించి బ్లేడుతో గొంతుకోసి అతిదారుణంగా హత్య చేసాడు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద‌ఛాయ‌లు ఆలుముకున్నాయి. కుటుంబ‌స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న కామారెడ్డి డీస్పీ లక్ష్మినారాయణ ఘటన వివరాలను వెల్లడించారు.

(పి.మ‌హేంద‌ర్, న్యూస్ 18 తెలుగు, ప్ర‌తినిధి)

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...