హైదరాబాద్ లో ఆదివారం శక్తిమంతమైన రసాయన పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ఓ వ్యక్తి తునాతునకలైపోయాడు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన అఫ్జల్‌గంజ్‌లో చోటుచేసుకుంది. వివరాలివే..
వరుస నేరాలతో కలవరపడుతోన్న విశ్వనగరం హైదరాబాద్ (Hyderabad) తాజాగా పేలుడు ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సిటీలో ఆదివారం శక్తిమంతమైన రసాయన పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ఓ వ్యక్తి తునాతునకలైపోయాడు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన అఫ్జల్‌గంజ్‌లో చోటుచేసుకుంది. (Chemical Explosion In Hyderabad) పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన అఫ్జల్‌గంజ్‌లో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32 ఏళ్ల వ్యక్తి దుర్మరణం చెందాడు. చనిపోయిన వ్యక్తిని భరత్ గా గుర్తించారు. పేలుడులో వ్యక్తి ముక్కలైపోయిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికిచేరుకున్నారు. పేలుడు జరిగిన తీరు, ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించారు.
అఫ్జల్ గంజ్ పరిధిలోని మొగరం బస్తీ దాల్ మహరాజ్‌గంజ్‌లో నివాసం ఉంటున్న భరత్ అనే వ్యక్తి రసాయనాల వ్యాపారం చేస్తుంటాడు. ఇవాళ ఉదయం ఆయన తన ఇంట్లో నిల్వ ఉన్న రసాయనాలను నాలా(డ్రెయినేజీ)లోకి పారబోసిన క్రమంలో పేలుడు సంభవించింది. మ్యాన్‌హోల్‌లో కెమికల్ వేసి నీళ్లు పోస్తుండగా ఒక్కసారిగా అందులో బ్లాస్ట్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న క్లూస్ టీ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తోంది.
CM KCR : కేసీఆర్ జాతీయ ప్లాన్ హైజాక్? -మమతా బెనర్జీ అనూహ్య చర్య -22 మంది నేతలతో ఈనెల 15న..
పేలుడు ధాటికి భరత్ అమాంతం గాల్లోకి దూసుకెళ్లాడని, అతని శరీరం ముక్కలుగా ఎగిరిపడిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితుడి తండ్రి గోపాల్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను దగ్గర్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.