Home /News /crime /

MAN KIDNAPS HIS 5 MONTHS OLD SON FOR MONEY IN GUNTUR DISTRICT BA

గుంటూరులో దారుణం.. 5 నెలల కన్న కొడుకునే కిడ్నాప్ చేయించిన తండ్రి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డబ్బు కోసం తన ఐదు నెలల కొడుకునే కిడ్నాప్ చేయించాడు. అయితే, అతడి పన్నాగం బయటపడింది.

    డబ్బు కోసం కన్న కొడుకుని తండ్రే కిడ్నాప్ చేయించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని పిల్లుట్ల రోడ్ లో నివాసముంటున్న శాగలంపూడి శివ అనే వ్యక్తి 29వ తేదీ రెండున్నర గంటల సమయంలో తన తమ్ముడు గాంధీ ఐదు నెలల కుమారుడు సంతోష్ కుమార్ ను అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారని, తనకు ఫోన్ చేసి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులను ఆశ్రయించాడు. కాగా, పిడుగురాళ్ల పట్టణ సీఐ సురేంద్రబాబు, వారి సిబ్బంది కిడ్నాప్ జరిగిన ఐదు గంటలలోపే కేసును ఛేదించి బాలుడిని సురక్షితంగా రక్షించారు. అపహరణకు గురైన బాలుడిని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ చేతుల మీదుగా బాలుని తల్లికి అప్పగించారు. ఈ సందర్భంగా తక్కువ వ్యవధిలో కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి రూరల్ ఎస్పీ విజయరావు అభినందనలు తెలియజేశారు. బాలుడి తండ్రే డబ్బు కోసం తన ఐదు నెలల కొడుకుని కిడ్నాప్ చేయించినట్టు గుర్తించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు