హోమ్ /వార్తలు /క్రైమ్ /

పెళ్లికి ఒప్పుకోని ప్రియురాలు... తండ్రి కిడ్నాప్... చివరకు...

పెళ్లికి ఒప్పుకోని ప్రియురాలు... తండ్రి కిడ్నాప్... చివరకు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తన ప్రియురాలు తనను ప్రేమించేందుకు నిరాకరించిందనే కోపంతో ఆమె తండ్రిని కిడ్నాప్ చేశాడు ఓ యువకుడు.

    ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో ఆమె తండ్రిని కిడ్నాప్ చేశాడు ఓ యువకుడు. కూతురిని పెళ్లికి ఒప్పించాలంటూ ఆయనను చిత్రహింసలు పెట్టాడు. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. 24 ఏళ్ల సంజీవ్... ఏడాదికాలంగా ఓ అమ్మాయి ప్రేమించాడు. ఇద్దరు డేటింగ్ కూడా చేశారు. వారి వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే తాను ప్రేమించిన సంజీవ్ ఎంతో మంచివాడని తల్లిదండ్రులను ఒప్పించిన యువతి... పెళ్లికి ఒప్పించింది. ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే సంజీవ్ మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న అతడి ప్రేయురాలు... ఈ విషయంపై అతడిని నిలదీసింది. అతడితో ప్రేమను, పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది.


    ఈ పరిణామంతో షాక్ అయిన సంజీవ్... తనను క్షమించి పెళ్లి చేసుకోవాలని యువతి వెంటపడ్డాడు. అతడి వేధింపులు భరించలేక ఢిల్లీ నుంచి తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లిపోయింది అమ్మాయి కుటుంబం. అయితే ఉద్యోగరిత్యా ఢిల్లీలోనూ ఉండిపోయాడు అమ్మాయి తండ్రి. ఎలాగైనా తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడయిన నిందితుడు సంజీవ్... అమ్మాయి తండ్రిని కిడ్నాప్ చేశాడు. ఆయనతో కూతురికి ఫోన్ చేయించి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. తనను పెళ్లి చేసుకోకపోతే నీ తండ్రిని చంపేస్తానని హెచ్చరించాడు. నిందితుడు తన తండ్రికి ఎలాంటి హాని తలపెడతాడో అని భయపడిన యువతి... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులను ఆశ్రయించింది. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు... యువతి తండ్రిని అతడి నుంచి విడిపించాడు. నిందితుడికి సహకరించిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

    First published:

    Tags: Blackmail, Crime, Kidnap

    ఉత్తమ కథలు