అప్పు తీర్చడం లేదని...భర్త ముందే భార్యను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారి...దారుణం...

ప‌రిస్థితుల నేఫ‌థ్యంలో త్వరలోనే డబ్బు ఇచ్చేస్తాన‌ని, ఇంకొంత గ‌డువు కావాల‌ని వ‌డ్డీ వ్యాపారిని కోరాడు. అందుకు ఒప్పుకోని వ్యాపారి లడ్డూ తన డబ్బులు తనకు చెల్లించాల్సిందేన‌ని గొడవకు దిగాడు.

news18-telugu
Updated: August 2, 2020, 11:54 PM IST
అప్పు తీర్చడం లేదని...భర్త ముందే భార్యను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారి...దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అప్పు తీర్చ‌లేద‌ని ఓ వ‌డ్డీ వ్యాపారి దారుణానికి ఒడిగ‌ట్టాడు. వివ‌రాళ్లోకెళితే.. పశ్చిమ బెంగాల్ లోని బీర్బూం జిల్లాలో సోహన్ అనే వ్య‌క్తి.. అదే గ్రామానికి చెందిన లడ్డూ అనే వ్య‌క్తి వద్ద రూ. 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే తీసుకున్న 2 లక్ష‌ల‌లో ఈ మ‌ధ్య‌నే ఒక లక్ష రూపాయలు కూడా చెల్లించాడు. మిగిలిన డ‌బ్బు త్వరలోనే చెల్లిస్తాన‌ని లడ్డూకు చెప్పాడు. అయితే.. డబ్బు ఎరేంజ్ కాకపోవడంతో మిగిలిన లక్షతో పాటు వడ్డీ స‌కాలంలో చెల్లించ‌లేక‌పోయాడు. ప‌రిస్థితుల నేఫ‌థ్యంలో త్వరలోనే డబ్బు ఇచ్చేస్తాన‌ని, ఇంకొంత గ‌డువు కావాల‌ని వ‌డ్డీ వ్యాపారిని కోరాడు. అందుకు ఒప్పుకోని వ్యాపారి లడ్డూ తన డబ్బులు తనకు చెల్లించాల్సిందేన‌ని గొడవకు దిగాడు. అంతేకాదు సోహన్ ఇంటికి వెళ్లి అతడి భార్యను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడు. ఆమె పై దాడికి పాల్ప‌డ్డాడు. బాధితురాలిని తన ఇంటికి లాక్కెళ్లి బంధించాడు.

తన డబ్బు చెల్లించి భార్యను విడిపించుకొని పోవాలని లడ్డూ తెగేసి చెప్పాడు. దీంతో సోహన్ చేసేదేమి లేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వ
Published by: Krishna Adithya
First published: August 2, 2020, 11:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading