ఆత్మహత్య చేసుకోవడానికి 17 అంతస్తు నుంచి దూకిన వ్యక్తి... కింద పసిబిడ్డపై పడ్డాడు

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం 17వ అంతస్తులో కిటికీ నుంచి కిందకు దూకేశాడు. కానీ, కింద ఉన్న ఐదు నెలల పసిబిడ్డ మీద పడ్డాడు. ఈ ఘటనలో భవనం మీద నుంచి దూకిన వ్యక్తితో పాటు కింద ఐదు నెలల బిడ్డ ఇద్దరూచనిపోయారు.

  • Share this:
    ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం 17వ అంతస్తులో కిటికీ నుంచి కిందకు దూకేశాడు. కానీ, కింద ఉన్న ఐదు నెలల పసిబిడ్డ మీద పడ్డాడు. ఈ ఘటనలో భవనం మీద నుంచి దూకిన వ్యక్తితో పాటు కింద ఐదు నెలల బిడ్డ ఇద్దరూచనిపోయారు. రష్యాలో ఈ ఘటన జరిగింది. రష్యాలోని నైరుతి ప్రాంతమైన వొరోనెజ్‌లో ఈ దారుణం జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో ఓ తల్లి తన బిడ్డను బేబీ ట్రాలీలో తీసుకుని వెళ్తోంది. ఆ సమయంలో మంచు పడుతోంది. రోడ్డు మీద నుంచి గల్లీ లోపలికి తల్లి తీసుకుని వెళ్తున్న సమయంలో పై నుంచి ఢబ్ మని ఏదో వస్తువు పడింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఆమెకు అక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కానంతగా షాక్‌కి గురైంది. ఈ క్రమంలో బిడ్డ మీద ఏదో పడిందని గ్రహించిన ఆమె సడన్‌గా ఆ బేబీ ట్రాలీని పక్కకు లాగింది. కానీ, అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఈ ఘటనను చూసిన అక్కడున్న వారు వెంటనే పోలీసులు, ఆంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆంబులెన్స్ వచ్చిన తర్వాత వారు బిడ్డను బతికించడానికి శాయశక్తులా కృషి చేశారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఐదు నెలల బిడ్డ చనిపోయింది. అదే సమయంలో 17వ అంతస్తు నుంచి దూకిన వ్యక్తిని కూడా వెంటనే ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు కూడా చనిపోయాడు. స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం ఆ ఐదు నెలల బిడ్డ ఆమెకు తొలి సంతానం అని తెలిసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: