శృంగారం మధ్యలో కండోమ్ తీసేసిన యువకుడికి 12 ఏళ్ల జైలుశిక్ష... ఎక్కడంటే...

సెక్స్ మధ్యలో కండోమ్ తీసేసిన నేరానికి 12 ఏళ్ల జైలు శిక్ష... ఇంగ్లండ్ దేశంలో విచిత్ర సంఘటన...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 1, 2019, 7:35 PM IST
శృంగారం మధ్యలో కండోమ్ తీసేసిన యువకుడికి 12 ఏళ్ల జైలుశిక్ష... ఎక్కడంటే...
ఆ సమయంలో కండోమ్ తీసేసిన యువకుడికి 12 ఏళ్ల జైలుశిక్ష... ఎక్కడంటే...
  • Share this:
శృంగారంలో కండోమ్ వాడడం తప్పనిసరి అని ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తూన్నా... అది లేకుండా సెక్స్ చేస్తేనే మజా అని ఫీల్ అవుతున్నారు చాలామంది. మనదేశంలో అయితే కండోమ్ వాడకపోయినా పెద్ద నేరం కాదు కానీ... విదేశాల్లో వ్యభిచారిణిలతో సంభోగం కావాలని కోరుకున్నప్పుడు కండోమ్ వాడడం తప్పనిసరి. ఒకవేళ అది లేకుండా సెక్స్ చేస్తే మాత్రం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. తాజాగా సెక్స్ మధ్యలో కండోమ్ తీసేసినందుకు ఏకంగా 12 ఏళ్ల పాటు జైలు జీవితం గడపబోతున్నాడు ఓ ఆంగ్లేయుడు. ఇంగ్లండ్‌లోని డోర్సెట్‌కు 35 ఏళ్ల లీ హోగ్బెన్ అనే వ్యక్తికి శారీరక సుఖం కావాలని అనిపించింది. వెంటనే ఓ వేశ్యను బుక్ చేసుకుని, రాయల్ బాత్ హోటెల్‌కి తీసుకెళ్లాడు. అయితే ఆమె కండోమ్ ధరిస్తేనే... సెక్స్ చేస్తాననే షరుతుతో అతనితో వచ్చింది. దానికి అంగీకరించి, ఆమెను హోటెల్‌కు తీసుకొచ్చాడు లీ హోగ్బెన్. అయితే సెక్స్ చేస్తున్న సమయంలో అది ఉండడం ఇబ్బందిగా భావించిన అతను... మధ్యలోనే దాన్ని తీసేశాడు.

ఆమె వద్దని ఎంత హెచ్చరించినా వినకుండా... లేకుండా సెక్స్ చేశాడు. దాంతో ఎయిడ్స్ వస్తుందేమోనని భయపడి పోయిన ఆమె... వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కండోమ్ లేకుండా బలవంతంగా సెక్స్ చేసేందుకు ప్రయత్నించిన లీ హోగ్బెన్‌పై అత్యాచారయత్నం కేసు నమోదైంది. ప్రాస్టిట్యూట్ అయినా ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే నేరంగా పరిగణిస్తారు. దాంతో ఇద్దరికీ DNA పరీక్షలు జరిపించిన పోలీసులు... అతను ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడని నిరూపించారు. డబ్బులు ఇచ్చి, ఆమె ఇష్టంతోనే సెక్స్ చేశానని చెప్పినా లీ హోగ్బెన్ వాదనను ఎవ్వరూ పట్టించుకోలేదు. సెక్స్ మధ్యలో కండోమ్ తీసేసిన అతనికి 12 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు.
First published: May 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు