నిశ్చితార్థం చేసుకొని అమ్మాయితో ఎంజాయ్ చేసి...పెళ్లికి ఒక రోజు ముందు వరుడు ఏం చేశాడంటే...

సునీల్, అమృతతో ఇక చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం ప్రారంభించాడు. సినిమాలు, షికార్లు అంటూ అమృతతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. కాగా పెళ్లి ముహూర్తం దగ్గర పడే కొద్దీ, తనకు కట్నం డబ్బులు కావాలని అమృత కుటుంబ సభ్యులను బలవంత పెట్టాడు.

news18-telugu
Updated: October 21, 2019, 4:14 PM IST
నిశ్చితార్థం చేసుకొని అమ్మాయితో ఎంజాయ్ చేసి...పెళ్లికి ఒక రోజు ముందు వరుడు ఏం చేశాడంటే...
ఆ సర్వే ప్రకారం.. అత్యంత ఎక్కువగా సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేసేది రైతులే.
  • Share this:
మేట్రీ మోనీ వెబ్ సైట్ ద్వారా అమ్మాయి కుటుంబంతో సంబంధం కలుపుకొని...సరిగ్గా పెళ్లికి ఒక రోజు ముందే మండపం నుంచి పెళ్లికొడుకు పరారైన ఘటన ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన నిందితుడు సునీల్ ( పేరు మార్పు) మేట్రీ మోనీ వెబ్ సైట్ ద్వారా అమ్మాయిలను వలలో వేసుకొని, వారి కుటుంబంతో పెళ్లి మాటలు మాట్లాడుకొని కట్నం డబ్బులు చేతిలోపడగానే అక్కడి నుంచి ఉడాయించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అయితే తాజాగా ఘజియాబాద్ జిల్లాలోని బాధితురాలు అమృత సింగ్ (పేరు మార్పు) కుటుంబంతో మేట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా తన కూతురుకి సంబంధాలు వెతుకుతుండగా, నిందితుడు సునీల్ తన ఫేక్ ప్రొఫైల్ ద్వారా వారి కుటుంబానికి పరిచయం అయ్యాడు. తానొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని, ఉన్నత కుటుంబానికి చెందిన వాడినని వారందరినీ నమ్మించాడు. అంతేకాదు తనకు కట్నకానుకల కింది 30 లక్షల నగదు, బంగారం కావాలని డిమాండ్ చేశారు. అయితే మంచి సంబంధం అని నమ్మిన అమ్మాయి తల్లిదండ్రులు సంబంధం ఓకే చేసుకొని నిశ్చితార్థం కూడా చేసేశారు.

ఇంకేముంది సునీల్, అమృతతో ఇక చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం ప్రారంభించాడు. సినిమాలు, షికార్లు అంటూ అమృతతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. కాగా పెళ్లి ముహూర్తం దగ్గర పడే కొద్దీ, తనకు కట్నం డబ్బులు కావాలని అమృత కుటుంబ సభ్యులను బలవంత పెట్టాడు. దీంతో పెళ్లికి ఒక రోజు ముందు మొత్తం నగదు ఇస్తామని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పారు. ఈ క్రమంలో పెళ్లి ముందు రోజు రాత్రి జరిగిన వేడుకల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు మొత్తం రూ.30 లక్షల నగదును సునీల్‌కు ముట్టజెప్పారు. అయితే తెల్లవారితే పెళ్లి అనే సమయంలో పొద్దునే సునీల్ మొత్తం డబ్బులను సూట్ కేసులో పెట్టుకొని, మారువేషంలో పెళ్లి మండపం నుంచి ఉడాయించాడు. మరికొద్ది గంటల్లో పెళ్లి అవుతుందనగా వరుడు మాయం కావడంతో, జరిగిన మోసం తెలుసుకొని వధువు కుటుంబసభ్యులు లబోదిబో మన్నారు. పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading