సగం కాలిన శవాన్ని పీక్కుతిన్న వ్యక్తి... తమిళనాడులో దారుణం... ‘అగోరా’ను చూసి...

ప్రతీకాత్మక చిత్రం

గంజాయికి బానిసై శవాలను పీక్కుతినడం మొదలెట్టిన వ్యక్తి... తమిళనాడులో భయాందోళనలు...

  • Share this:
తమిళనాడు పోలీసులకు ఎవరో కాల్ చేశారు. ఓ వ్యక్తి స్మశానంలో శవాన్ని తింటున్నాడని చెప్పారు. పోలీసులు నమ్మలేదు. జోక్స్ వేయొద్దని కాల్ చేసిన వ్యక్తిపైనే ఒకింత సీరియస్ అయ్యారు. కానీ అవతలి వ్యక్తి మరింత గట్టిగా చెప్పాడు. నిజమే సార్... నిజంగానే శవాన్ని తింటున్నాడు... వచ్చి చూడండి మీకే తెలుస్తుంది అంటూ ఎడ్రస్ చెప్పాడు. వెంటనే పోలీసులు... తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న వాసుదేవనలూర్ దగ్గర్లోని... రామనాథపురం ఊరికి వెళ్లారు. అక్కడి స్మశానంలో చితిపై ఓ శవం కాలుతూ ఉంది. ఆ శవాన్ని ఆ వ్యక్తి చికెన్ కోసి తిన్నట్లుగా కత్తితో కోసుకుంటూ కొద్దికొద్దిగా తినడం పోలీసులు చూశారు. షాకైన పోలీసులకు వామ్టింగ్ వచ్చినంతపనైంది.

అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా కొన్ని విషయాలు తెలిశాయి. అతని పేరు మురుగేశన్. 43 ఏళ్లు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుడుకి తోడు గంజాయికి బానిసయ్యాడు. అలాంటి భర్తతో జీవించలేక, భార్య పిల్లల్ని తీసుకొని వేరేగా జీవిస్తోంది. ఇక అప్పటి నుంచీ స్మశానం బాట పట్టాడు. అక్కడకు తరచుగా వెళ్తూ... శవాల్ని తినేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. అతన్ని చూసి భయాందోళనలు చెందిన వాళ్లంతా పోలీసులకు కథలు కథలుగా అతని గురించి చెప్పారు.

ఈమధ్యే ఓ ముసలావిడ చనిపోతే, ఆ స్మశానంలోనే అంత్యక్రియలు చేశారు. ఆ రాత్రి అక్కడకు వచ్చిన మురుగేశన్... చితిపై కాలుతున్న శవాన్ని కోసి తిన్నాడు. అది చూసిన స్థానికులు తీవ్రంగా భయపడ్డారు. ఇలాంటి సందర్భాలు ఈమధ్య ఎక్కువయ్యాయి. మొత్తానికి మురుగేశన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతను సరిగా మాట్లాడకుండా నాటకాలాడుతుండటంతో... చెన్నైలోని కీల్ పాక్కం మెంటల్ హాస్పిటల్‌కు పంపించారు.

Pics: బ్యూటీఫుల్ సాన్య మల్హోత్ర లేటెస్ట్ పిక్స్
First published: