
Photo Credit : Twitter
Delhi : ఈ రోజుల్లో దొంగలు బాగా తెలివి మీరిపోయారు. కరోనా టైమ్ లో వచ్చిన పీపీఈ కిట్ ఒక ఘరానా దొంగ పాలిట వరంగా మారింది. . కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి డాక్టర్లు వేసుకొనే పీపీఈ కిట్ ను దొంగతనానికి వాడుకున్నాడు.
ఈ రోజుల్లో దొంగలు బాగా తెలివి మీరిపోయారు. కరోనా టైమ్ లో వచ్చిన పీపీఈ కిట్ ఒక ఘరానా దొంగ పాలిట వరంగా మారింది. . కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి డాక్టర్లు వేసుకొనే పీపీఈ కిట్ ను దొంగతనానికి వాడుకున్నాడు. పీపీఈ కిట్ వేసుకొని ఓ జువెలరీ షాపులోకి చొరబడ్డాడు తెలివి మీరిన దొంగ. ఏకంగా రూ.13 కోట్లు విలువ చేసే 25 కేజీల బంగారాన్ని దోచుకెళ్లాడు. అయితే ఆ వెంటనే పోలీసులకు దొరికిపోయాడు. ఈ పీపీఈ కిట్ దొంగను మహ్మద్ షేక్ నూర్గా గుర్తించారు. కర్ణాటకలోని హుబ్లీకి చెందిన నూర్ ఈ జువెలరీ షాపు పక్కనే ఉన్న ఓ ఎలక్ట్రానిక్స్ షాపులో పని చేసేవాడు. జువెలరీ షాపు పక్క బిల్డింగ్ పైకప్పు నుంచి అతడు మంగళవారం రాత్రి షాపులోకి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఆ సమయంలో షాపు బయట ఐదు మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయినా వాళ్లు షేక్ నూర్ రావడాన్ని గుర్తించలేకపోయారు. షాపులో తాను చోరీ చేసిన బంగారాన్ని ఓ ఆటోలో తీసుకెళ్లినట్లు కూడా సీసీటీవీ ఫుటేజీలో తేలింది. అయితే పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించి అతన్ని అరెస్ట్ చేయడం విశేషం. దొంగలు ఇలా పీపీఈ కిట్లలో వచ్చి చోరీలు చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇండియాలోనే కాదు.. ఆస్ట్రేలియా, చైనాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి.
కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత పీపీఈ కిట్ల వినియోగం బాగా పెరిగింది. ఇక అతడు దొంగతనం చేసే సమయంలో నగల షో రూం బయట ఐదుగురు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉన్నారు. ఇక తనను ఎవరు గుర్తు పట్టకుండా ఉండటం కోసం పీపీఈ కిట్ ధరించి దొంగతనం చేయాలని భావించాడు. ఇక షోరూం బయట గట్టి కాపలా ఉండటంతో దాని ఎందురుగా ఉన్న భవనం మీదకు ఎక్కి.. అక్కడి నుంచి షో రూంలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన నూర్ డెస్క్ మీద నుంచి అవతలి వైపుకు దూకి.. ఆభరణాల కోసం వెతికి.. దొరికిన కాడికి తీసుకుని షో రూం నుంచి బయట పడ్డాడు. ఆ తర్వాత అతడు ఆటోలో అక్కడ నుంచి వెళ్లి పోయాడు. ఇక అతడు షో రూంలో చేసిన విన్యాసాలు అన్ని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ గా మారాయ్. కేసు నమోదు చేసిన పోలీసులు నూర్ని గుర్తించి అరెస్ట్ చేశారు.
Published by:Sridhar Reddy
First published:January 21, 2021, 16:20 IST