ఓ వ్యక్తి మద్యం తాగి గోల చేస్తున్నాడంటూ బంధువులు అతడిని చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టారు. అత్యంత దారుణంగా మంటల్లో కాలి చనిపోయాడు. ఒడిశాలో ఈ ఘటన జరిగింది. ఒడిశాలోని హండపా పోలీస్ స్టేషన్ పరిధిలో కడలిముండా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఓ 25 సంవత్సరాల యువకుడు నిత్యం మద్యం తాగి గోల చేస్తున్నాడు. బంధువులు, ఇరుగుపొరుగు వారు, గ్రామస్తులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ రోజూ ఇంటి మీదకు గొడవలు తెస్తున్నాడు. అతడికి మద్యం మానేయాలని కుటుంబసభ్యులు నచ్చజెప్పారు. బందువులు కూడా మద్యం తాగినా గోల చేయకుండా ఇంటి వద్దకు వచ్చి ఉండమని హెచ్చరించారు. అయినా సరే ఆ యువకుడు వారి మాట వినలేదు. తన పనిలో తాను ఉన్నాడు. రోజూ మద్యం తాగి వచ్చి ఇతరులతో గొడవపడడం చేసేవాడు. ఈ క్రమంలో అతడి తీరుతో కుటుంసభ్యులు, గ్రామస్తులు విసిగిపోయారు. అతడి వైఖరి శృతిమించడం, ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో కోపోద్రిక్తులయ్యారు.
ఈ క్రమంలో జనవరి 12వ తేదీ సాయంత్రం కూడా యువకుడు మళ్లీ మద్యం తాగి వచ్చి గొడవ చేయడం మొదలు పెట్టాడు. దీంతో బంధువులు అతడిని చెట్టుకు కట్టేశారు. బీభత్సంగా కొట్టారు. ఆ కోపంలో ఏకంగా అతడి మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ మంటల్లో అతడు సజీవదహనం అయ్యాడు. అయితే, మరికొందరు వెంటనే అతడిని తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అయితే, అతడిని తీసుకుని వచ్చేసరికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితుడిని రాజ్ కిషోర్ ప్రధాన్‌గా గుర్తించామన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. ప్రధాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పండుగ వేళ ఏపీలో దారుణం.. పట్టపగలు మహిళపై అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ లో పండుగ వేళ దారుణం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న మహిళపై కన్నేసిన యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. రాత్రివేళ లిఫ్ట్ ఇస్తామని బాధితురాలిని నమ్మించిన ఆ దుర్మార్గులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది.గన్నవరం మండలం, తెంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ.., వేరే ప్రాంతంలో నివాసముంటోంది. సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామానికి వస్తోంది. గన్నవరం నుంచి తెంపల్లి వెళ్లే మార్గంలో బస్సు సర్వీసులు లేకపోవడం, ఆటోలు కూడా దొరక్కపోవడంతో అటువైపుగా వస్తున్న ఇద్దరు యువకులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామన్నారు. దీంతో ఆమె కూడా వారి బైక్ ఎక్కింది. ఐతే ఆమెను గ్రామానికి తీసుకెళ్లకుండా రూటు మార్చిన యువకులు..,ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పట్టపగలే ఈ దారుణం జరిగినా ఎవరూ గుర్తించలేకపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.