• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN IN MUMBAI TRAPS WOMEN WITH MATRIMONIAL SITE SEXUAL HARASSED MORE THAN DOZEN AK

పెళ్లిచూపులుతో మొదలు.. ఆ తరువాత అక్కడ మీటింగ్.. ఇలా ఏకంగా 12 మంది యువతుల రేప్..

పెళ్లిచూపులుతో మొదలు.. ఆ తరువాత అక్కడ మీటింగ్.. ఇలా ఏకంగా 12 మంది యువతుల రేప్..

ప్రతీకాత్మక చిత్రం

నాలుగు నెలల పాటు నిందితుడి కోసం అన్వేషించిన పోలీసులు.. కొద్దిరోజుల క్రితం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

  • Share this:
    అతడు మెకానికల్ ఇంజినీర్. బాగా చదువుకున్నాడు. కంప్యూటర్ మీద కూడా బాగా నాలెడ్జ్ ఉంది. బుద్ధి సరిగ్గా ఉంటే అతడి లైఫ్ మరోలా ఉండేది. కానీ అతడి ఆలోచనలన్నీ వక్రమార్గంలో పయనించాయి. అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్న ఈ మాయగాడు.. ఏకంగా 12 మంది యువతలను రేప్ చేశాడని పోలీసులు గుర్తించాడు. మరికొంతమంది యువతులను వేధించినట్టు అనుమానిస్తున్నాడు. అయితే అతడు వీరిని లొంగదీసుకునేందుకు ఎంచుకున్న మార్గం చూసి పోలీసులు విస్తుపోయారు. వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన 37 ఏళ్ల కరణ్ గుప్తా గతంలో అనేక పెద్ద కంపెనీల్లో పని చేశాడు.

    ఆ సమయంలోనే అమ్మాయిలను లొంగదీసుకోవాలని అతడిలో ఆలోచనలు మొదలయ్యాయి. ఇందుకోసం అతడు మ్యాట్రిమోనీ సైట్లను ఎంచుకున్నాడు. ఫేక్ ఐడీలను క్రియేట్ చేశాడు. చదువుకున్న అమ్మాయిలను ముగ్గులోకి దించాడు. ముందుగా వారితో పరిచయం పెంచుకుని ఆ తరువాత ఫోన్ నంబర్ సంపాదించేవాడు. అలా వారిని రెస్టారెంట్‌కు, పబ్‌కు పిలిచి వారిపై వేధింపులకు దిగేవాడు. ఈ రకంగా దాదాపు 12 యువతులను కరణ్ గుప్తా రేప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

    ఇతడి బాధితులు మరికొందరు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండటం ఇతడికి మరింతగా కలిసొచ్చిందని పోలీసులు తెలిపారు. నాలుగు నెలల పాటు నిందితుడి కోసం అన్వేషించిన పోలీసులు.. కొద్దిరోజుల క్రితం అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడి చేసిన నేరాలను కక్కించారు. అతడి నేరాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని రాబడతామని పోలీసులు తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు