హోమ్ /వార్తలు /క్రైమ్ /

షాకింగ్.. 41 ఏళ్ల వ్యక్తికి 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. కారణం ఏంటంటే..

షాకింగ్.. 41 ఏళ్ల వ్యక్తికి 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kerala: వరుసకు బంధువు కావడంతో రోజు ఇంటికి వస్తుండేవాడు. తల్లిదండ్రులు పనికి వెళ్లినప్పుడు కూడా ఏదో కారణంతో బాలికను తన ఇంటికి తీసుకెళ్లేవాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

కామాంధులు రెచ్చిపోతున్నారు. పసిపాపల నుంచి పండు ముసలి వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. మహిళలు, చిన్నారులు సింగిల్ గా కన్పిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల ఆడవాళ్లకు తమ ఇంట్లోనే భద్రత కరువైంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. గుడి, బడి, బస్టాండ్, రైల్వే స్టేషన్ ఏ ఒక్క చోట కూడా మహిళలకు సెఫ్టీలేదని చెప్పవచ్చు. చివరకు పోలీస్ స్టేషన్ లో కూడా మహిళలకు సరైన భద్రతలేదు. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పోక్సో, నిర్భయ చట్టాలను ఇంకా కఠినంగా అమలుచేయాలి. కాగా, ఒక చిన్నారిపై అత్యాచారం చేసిన ఒక నిందితుడిని కోర్టు కఠిన కారాగారా శిక్ష విధించింది. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కేరళలోని (kerala) పతనం తిట్టలోని పోక్సో కోర్టు ఒక కామాంధుడికి 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5 లక్షల జరిమానాను విధించింది. ఆనందన్ పీఆర్ అలియాస్ బాబు అనే దుర్మార్గుడు.. తిరువళ్ల గ్రామ పరిధిలో 10 ఏళ్ల చిన్నారిని రెండెళ్లపాటు అత్యాచారం చేశాడు. అతను బాలికకు బంధువు కావడంతో, తరచుగా ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి కామవాంఛ తీర్చుకునేవాడు. ఇలా 2019,2021ల మధ్య రెండేళ్ల పాటు బాలికను బెదిరిస్తూ పశువాంఛను తీర్చుకున్నాడు. ఈక్రమంలో బాలిక ఆరోగ్యం పాడవడంతో, వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

అప్పుడు ఆమెను టెస్టు చేసిన వైద్యులు షాకింగ్ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వెంటనే వారు నిందితుడిపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టులో హజరుపర్చారు. ఈ క్రమంలో అప్పటి నుంచి నిందితుడు జైలులోనే ఉన్నాడు. తాజాగా, పతనం తిట్టలోని పోక్సో కోర్టు నిందితుడికి 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 5 లక్షల జరిమానా విధించింది. నిందితుడు జరిమానా చెల్లించకపోతే, అతను మరో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. జిల్లాలో పోక్సో కేసులో నిందితులకు విధించిన గరిష్ట శిక్ష ఇదే. ప్రస్తుతం ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Female harassment, Kerala

ఉత్తమ కథలు