ఇద్దరు మహిళలను ఇంట్లోనే రేప్ చేసిన భర్త... మొబైల్‌లో వీడియో తీసిన భార్య...

వుమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న దంపతులు... భర్త అత్యాచారం... ఆ దృశ్యాలను మొబైల్‌లో రికార్డు చేసి భార్య బ్లాక్ మెయిలింగ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 25, 2019, 11:20 PM IST
ఇద్దరు మహిళలను ఇంట్లోనే రేప్ చేసిన భర్త... మొబైల్‌లో వీడియో తీసిన భార్య...
ఇద్దరు మహిళలను ఇంట్లోనే రేప్ చేసిన భర్త... వీడియో తీసిన భార్య...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 25, 2019, 11:20 PM IST
భర్త మరో మహిళతో కలిసి తిరుగుతున్నప్పుడు చూస్తేనే... ఏ మహిళకైనా ఒళ్లు మండుతుంది. అయితే ఆమె మాత్రం భర్త మరో మహిళను రేప్ చేస్తుంటే, బ్లాక్ మెయిల్ చేసేందుకు వీడియో రికార్డు చేసింది. పోలీసులను కూడా షాక్‌కు గురి చేసిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది. ముజఫర్‌నగర్ జిల్లాలోని స్వానాయ్ లోహన్ ఏరియాకు చెందిన రితా లోహన్, శాన్వీ భార్యాభర్తలు. ఓ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో పని చేస్తున్న రితా లోహాన్... అదనపు డబ్బుల కోసం వుమెన్ ట్రాఫికింగ్ కూడా జరుపుతున్నాడు. ఆపదలో దిక్కుతోచని స్థితిలో ఉన్న మహిళలను చేరదీసి, ఆశ్రయిస్తానని నమ్మించి... వారిని విదేశాలకు తరలిస్తుంటాడు. ఇందులో భాగంగా ఎటువెళ్లాలో తెలియక రోడ్డు మీద నిల్చున్న ఇద్దరు యువతులను ఇంటికి తీసుకొచ్చాడు రితా. ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు మీద నిల్చున్న 22, 23 ఏళ్ల యువతులు, తన ఇంట్లో బస కల్పిస్తానని చెప్పిన రితా లోహాన్ మాటలు నమ్మి, అతని వెంట వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వారిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త చేస్తున్న పని చూసి, ఆపాల్సిన శాన్వీ... మొబైల్‌లో ఈ దృశ్యాలను వీడియో రికార్డు చేసింది.

వీడియోలను చూపించి, ఇద్దరు యువతులను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టింది శాన్వీ. తాము చెప్పినట్టుగా వినాలంటూ యువతులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంటికి రావాల్సిన యువతులు, ఎంతకీ రాకపోవడంతో భయాందోళనలకు గురైన బంధవులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టగా వుమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న దంపతులు బాగోతం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... రితా లోహన్, శాన్వీ దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

First published: April 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...