చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే (Police harassed) కామాంధులుగా మారుతున్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను (Police) వేధిస్తున్నారు. కొంత మంది ఇలాంటి పనులు చేయడం వలన డిపార్ట్ మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే యూపీలో పోలీసు స్టేషన్ లో యువతిపై స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (Police officer rapes girl in station) అత్యాచార ఘటన తీవ్ర దుమారం రేపుతుంది. అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతిని, లాకప్ లో లాక్కెళ్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ రేప్ చేశాడు. ఇప్పుడు మరో మహిళకు స్టేషన్ లో వింత అనుభవం ఎదురైంది.
పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi) ఈ ఉదంతం గత శుక్రవారం జరిగింది. ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. గత శుక్రవారం.. ఒక యువతి రాత్రి పూట క్యాబ్ లో హౌజ్ ఖాన్ ఏరియా నుంచి న్యూ ఫ్రెండ్స్ కాలనీ లోని సూర్య హోటల్ కు వెళ్తుంది. అప్పుడు ట్రాఫిక్ వలన ఒక చోట కారు ఆగింది. ఇంతలో ఒక వ్యక్తి కారు డ్రైవర్ ను నోటికొచ్చినట్లు తిట్టటం మొదలు పెట్టాడు. ఎంతగా వారించిన వినలేదు. దీంతో ఆమె బయటకు వచ్మి అతడిని వారించే ప్రయత్నం చేసింది. అతను మరింత రెచ్చిపోయాడు. మహిళపై కూడా నోటికొచ్చి మాట్లాడాడు.
దీంతో ఆమె ఒక్కసారి అతని చెంప పగుల (Woman harassed) గొట్టింది. దీంతో అతను ఆమెపై పలుమార్లు చెంపదెబ్బలు కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత యువతి తన వారికి సమాచారం అందించింది. ఘటనపై అదే రోజు రాత్రి కల్కాజీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. కానీ వారు ఏమాత్రం పట్టించుకొలేదు. తాను బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నానని పేర్కొన్న యువతి, సంఘటన తర్వాత తాను కల్కాజీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని, అక్కడ పోలీసులు (Police misbehaved) తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె మరుసటి రోజు మరల ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత.. ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. రాత్రి స్టేషన్ లో ఉన్న అధికారి, ముగ్గురు సిబ్బందిని జిల్లా కార్యాలయానికి అటాచ్ చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే ఉదయ్ వీర్ సింగ్ అనే నిందితుడిని అరెస్టు చేశామని మరోక నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. దీనిపై పోలీసులు వాదన మరోలా ఉంది. తాము అసభ్యంగా ప్రవర్తించలేదని.. యువతి ఆరోపణలను ఖండించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఉన్నతస్థాయి పోలీసులు ప్రత్యేక సమగ్ర విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi, Delhi police, Harassment on women