Man Hits Woman Official Over Wife's Unpaid Salary : ఒడిశాలోని గంజాం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. బెల్లంగుంటలోనిన బాలిక ఉన్నత పాఠశాలలో శాంతిలత సాహు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. గత నాలుగేళ్లుగా ఆమెకు శాలరీ పడట్లేదు. దీంతో దంపతులు పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. డీఈవో కావాలనే వేధిస్తుందని ఆరోపించారు. ఈ విషయం కాస్త.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కు తెలిసింది. ఆయన పాఠశాలకు వచ్చారు.
డీఈవో సంబంధించి విషయం గురించి మాట్లాడుతున్నారు. ఇంతలో బాధితురాలి భర్త.. కల్గ చేసుకుని ఎమ్మెల్యే ముందే మహిళా డీఈవో చెంపపగుల గొట్టారు. దీంతో ఎమ్మెల్యే షాక్ కు గురయ్యారు. డీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే,దీనిపై డీఈవో వాదన మరోలా ఉంది. ఉపాధ్యాయురాలు కావాలనే విధులల్లో చేరడం లేదని ఆరోపించింది. ఈ క్రమంలో వీరిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
హర్యానాలోని ఫరీదాబాద్ లో దారుణమైన సంఘటన జరిగింది.
Faridabad Six including woman booked for rape in haryana: హర్యానాలోని ఫరీదాబాద్ లో దారుణమైన సంఘటన జరిగింది. సెక్యురీటి కంపెనీలో పనిచేస్తున్న ఒక మహిళ తోటి, ఉద్యోగిని పనిమీద హోటల్ కు పిలిచిందని వెళ్లింది. అక్కడ ఒక ఊహించని సంఘటన జరిగింది. మహిళచేత ఒక కూల్ డ్రింక్ తాగించారు. ఆ తర్వాత.. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో.. ఆమెపై కొంత మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీశారు.
కాసేపటికి లేచి చూసే సరికి... ఆమెకు పరిస్థితి తెలిసింది. విషయం ఎవరికైన చెబితే.. తమవద్ద ఉన్న వీడియోలను పబ్లిక్ గా షేర్ చేస్తామని ఆమెను బెదిరించారు. వీడియో అడ్డంపెట్టుకుని ఆమెపై కొంత మంది చాలా సార్లు అత్యాచారం చేశారు. ఈ ఘటన 2020లో జరిగింది. దాదాపు రెండేళ్ల పాటు వారి టార్చర్ భరించింది. ఆ తర్వాత.. ఆమె పోలీసులకు జరిగిన దారుణాన్ని తెలిపింది.
వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మహిళతో సహా..ఆరుగురు నిందితులను వీరేంద్ర దహియా, హరి సింగ్, జై ప్రకాష్, సుఖ్‌బీర్, దేవిరామ్‌లుగా గుర్తించి ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attack, Crime news, Full salary, Odisha