ఓ మహిళను ఆమె సమీప బంధువే దారుణంగా హత్య చేశాడు. భర్త, కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న సమయంలో తన వాహనంతో ఢీ కొట్టాడు. దీంతో బైక్‌పై నుంచి ముగ్గురు కిందపడిపోయారు. అయితే కిందపడి ఉన్న మహిళపై నుంచి వాహనం పోనివ్వడంతో ఆమె మృతిచెందింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు పొలం అమ్మిన డబ్బు విషయంలో తలెత్తిన వివాదమే కారణంగా అని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలానగరం మండలంలోని మాచారం గ్రామానికి చెందిన యాదయ్య తల్లికి, ఆమె ముగ్గరు చెల్లెళ్లకు కలిపి జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో ఎకరం ఎనిమిది గుంటల స్థలం ఉంది. అయితే ఈ స్థలాన్ని విక్రయించగా వచ్చిన రూ. 80 లక్షలను యాదయ్య ఒక్కడే తీసుకున్నాడు. దీంతో యాదయ్య చిన్నమ్మల పిల్లలు పొలం అమ్మిన డబ్బులో తమ వాటా ఇవ్వాలని కోరారు. అయితే అందుకు యాదయ్య నిరాకరించాడు. దీంతో యాదయ్య చిన్నమ్మ కుమారులు అతనిపై కోపాన్ని పెంచుకున్నారు.
ఇక, ప్రస్తుతం షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న యాదయ్య.. ఆదివారం తన భార్య శైలజ(35), కుమార్తె నిహారిక(15)లతో కలిసి కారుకొండలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యాడు. సాయంత్రం వేళ తిరిగి షాద్‌నగర్‌కు భార్య, కూతురితో కలిసి బైక్‌పై బయలుదేరాడు. అయితే యాదయ్యపై కక్ష పెంచుకున్న అతని చిన్నమ్మ కుమారుడు నరసింహులు.. తన వాహనంలో(సరకు రవాణా చేసే ట్రాలీ) యాదయ్య బైక్‌ను వెంబడించాడు. మాచారం శివారులో యాదయ్య కుటుంబం ప్రయానిస్తున్న బైక్‌ను తన వాహనంతో ఢీ కొట్టాడు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు కిందపడిపోయారు. కిందపడిన యాదయ్య.. వెంటనే పైకి లేచి అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశాడు. అయితే అతని భార్య శైలజ మెల్లగా పైకి లేచేందుకు ప్రయత్నించగా నిందితుడు మరోసారి ఆమెను వాహనంతో ఢీకొట్టాడు. అనంతరం కిందపడిపోయిన శైలజపైకి వాహనాన్ని ఎక్కించారు.
ఆ తర్వాత వాహనం అక్కడే వదిలేసి పారిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన యాదయ్య, అతని కూతురు నిహారికలను షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ఇక, పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాదయ్య వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేపట్టారు.
Published by:Sumanth Kanukula
First published:January 11, 2021, 07:33 IST