హోమ్ /వార్తలు /క్రైమ్ /

Attack on young people: స్కూటర్ ను ఢీకొట్టినందుకు ఇద్దరిని చితకబాదారు.. కర్రతో వాళ్లను అతి దారుణంగా..

Attack on young people: స్కూటర్ ను ఢీకొట్టినందుకు ఇద్దరిని చితకబాదారు.. కర్రతో వాళ్లను అతి దారుణంగా..

సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు

సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు

Attack on young people: రాసుకుంటూ బైక్‌పై వెళ్లిన వ్య‌క్తిని మరియు అత‌డితో ఉన్న మ‌రో వ్య‌క్తిపై స్థానికులు దాడి చేసి దారుణంగా కొట్టారు. ఢిల్లీలోని పాల‌మ్ ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. బైక్‌పై వెళ్తున్న ఇద్ద‌రు ఒక స్కూట‌ర్‌ను పొరపాటున రాసుకుంటూ వెళ్ల‌డంతో స్థానికులు వారిని అడ్డుకుని దాడి చేశారు.

ఇంకా చదవండి ...

  హత్యలకు అయినా.. ఆత్మహత్యలకు అయినా దేశంలో ముఖ్యంగా గుర్తుకు వచ్చే కొన్ని ప్రదేశాల్లో ఢిల్లీ ఒకటి. నిర్భయ ఘటన జరిగిన దగ్గర నుంచి ఎన్నో సంఘటనలు అక్కడ చోటుచుసుకున్నాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి అతనితోపాటు తన స్నేహితుడు కలిసి బైక్ పై వెళ్తున్నారు. పొరపాటున రోడ్డు పక్కన ఉన్న స్కూటర్ ను వాళ్లు రాసుకుంటూ వెళ్లారు. దీంతో బైక్‌పై వెళ్లిన వ్య‌క్తి, అత‌డితో ఉన్న మ‌రో వ్య‌క్తిపై స్థానికులు దాడి చేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఢిల్లీలోని పాల‌మ్ ప్రాంతంలో జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్ద‌రు ఒక స్కూట‌ర్‌ను రాసుకుంటూ వెళ్ల‌డంతో స్థానికులు వారిని అడ్డుకుని దాడి చేశారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతడి ముఖంపై కొట్టగా మరో వ్యక్తి కర్రతో తలపై కొట్టాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక కూర్చున్న వ్యక్తిని కూడా కొందరు దాడి చేశారు. అక్క‌డ ఉన్న సీసీటీవీలో ఇది రికార్డు అయ్యింది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  దేశ రాజధాని ఢిల్లీలో ఒక వాహనదారుడిని, అతని మిత్రుడిని నడిరోడ్డుపైనే చితకబాదిన వీడియో ఆలస్యంగా వెలుగుచూసింది. తమ స్కూటర్‌ను గుద్దాడన్న కోపంతో ఆ బండి యజమాని, అతని బంధువులు వారిని రోడ్డుపైనే అడ్డగించి కర్రలతో చితకబాదుతూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఆ వీడియోలో చేతిలో హెల్మెట్‌ పట్టుకొని ఉన్న వ్యక్తిని టార్గెట్‌ చేస్తూ ఒక వ్యక్తి కర్రతో దాడి చేయగా.. మరో వ్యక్తి అతనిపై దాడికి దిగారు. వాహనదారుడి స్నేహితుడిని కూడా చితకబాదారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ దాడిలో వాహనదారుడి తలకు పెద్ద దెబ్బ తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది.

  వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆలస్యంగా వెలుగు చూడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సమాచారం మేరకు గాయపడిన వ్యక్తి నుంచి వివరాలను పోలీసులు సేకరించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా త‌మ కుమారుడికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని, దాడి చేసిన వారిపై హ‌త్యాయత్నం కింద పోలీసులు కేసు న‌మోదు చేయాల‌ని అత‌డి పేరెంట్స్ డిమాండ్ చేశారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Attack, Attack peoples, Brutally, Cctv footage, Crime news, Delhi

  ఉత్తమ కథలు