Home /News /crime /

MAN HIT CYCLIST IN CHANDIGARH AND TRAVELS 10 KM WITH DEAD BODY ON TOP OF THE CAR BA

Viral Video: సైక్లిస్ట్‌ను ఢీకొట్టి.. ఆ శవం కారు టాప్ మీద ఉండగా.. మరీ ఇంత క్రూరత్వం చూడండి..

కారు మీద శవంతో వెళ్తున్న దృశ్యం

కారు మీద శవంతో వెళ్తున్న దృశ్యం

పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ పరిశీలించారు. ఆ సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ వీడియోను చెక్ చేస్తే అందులో ఓ వ్యక్తి మృతదేహాన్ని కారు మీద నుంచి కింద పడేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

    ఎక్కడైనా రోడ్డు మీద ఓ ప్రమాదం జరిగిందంటే.. జనం గుంపులు గుంపులుగా జమ అవుతారు. ఏం జరిగిందో అని వింతగా చూస్తారు. అదే మనమే ప్రమాదం చేస్తే.. అయ్యో ఏమైందో అని ఆగి వెంటనే గాయపడిన వారిని చూస్తాం. వారికి ఏమైనా జరిగితే మన గుండె గుభేల్ మంటుంది. అలాంటిది ఓ వ్యక్తి తన కారుతో ఓ సైక్లిస్టును ఢీకొట్టాడు. ఆ ధాటికి సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తి ఎగిరి కారుబ్యానెట్ మీద పడ్డాడు. మళ్లీ ఎగిరి కారు టాప్ పైన పడ్డాడు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే, కనీసం ఆగి, అయ్యో ఏం జరిగిందో అని కూడా చూడలేదు ఆ కారు నడిపే వ్యక్తి. ఆ కారుమీద మనిషి అలా పడి ఉండగానే తన కారును వేగంగా పోనిచ్చాడు. అలా ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా 10 కిలోమీటర్ల దూరం ఇలా కారు మీద మనిషి ఉండగానే నడుపుకుంటూ వెళ్లాడు.

    అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. ఆ సైక్లిస్ట్ ఈ ప్రమాదంలో చనిపోయాడు. ఆ శవాన్ని పైన పెట్టుకునే వెళ్లాడు కారు నడిపే వ్యక్తి. ఛండీగఢ్‌ పక్కన ఉన్న మోహాలీలో ఈ ఘటన జరిగింది. ఈ దారుణం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. స్థానికంగా జిరక్ పూర్‌లోని ఏరోసిటీ సీ బ్లాక్ నుంచి వేగంగా వస్తున్న కారు సైకిల్ మీద వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. అనంతరం ఆ డెడ్ బాడీని కారుమీద అలాగే ఉంచి 10 కిలోమీటర్లు వెళ్లాడు. అక్కడ సన్నీ ఎన్‌క్లేవ్ దగ్గర షోరూంల ముందు ఆ మృతదేహాన్ని పడేసి అతడు పారిపోయాడు. షోరూం దగ్గర మృతదేహాన్ని చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

    పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ పరిశీలించారు. ఆ సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ వీడియోను చెక్ చేస్తే అందులో ఓ వ్యక్తి మృతదేహాన్ని కారు మీద నుంచి కింద పడేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. ఆ కారు వచ్చిన మార్గాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే జరిగిన దారుణం మొత్తం వెలుగులోకి వచ్చింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Chandigarh S34p01, Punjab, VIRAL NEWS, Viral Video

    తదుపరి వార్తలు